కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్రశాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే మరో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా పాన్ ఇండియా హీరోయిన్ ఉండబోతుంది. ఎలాగూ ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్ అంటే.. నేషనల్ రేంజ్ ఫాలోయింగ్ ఉంటేనే ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేస్తూ వస్తున్నారు గత కొన్ని సినిమాలుగా. అలా సాహోలో శ్రద్ధాకపూర్ తో రొమాన్స్ చేశాడు ప్రభాస్. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న సైన్స్ – ఫిక్షన్ సినిమాలో దీపిక పదుకోణును హీరోయిన్ గా లాక్ చేశారు.
Also Read: చిరు ‘ఆచార్య’లో రాంచరణ్ షాకింగ్ లుక్ రిలీజ్
అలాగే త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఆదిపురుష్ లో కృతి సనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కాగా ఇప్పుడు ఇదే ఊపులో సలార్ కోసం కత్రినాకైఫ్ ను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి నుండి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ప్లేస్ లో వేసిన సెట్ లో ఈ సినిమా షూట్ స్టార్ట్ చేస్తారని.. ముందుగా ప్రభాస్ పైనే షూట్ చేస్తారని తెలుస్తోంది. 2021లో లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. కాకపోతే, ప్రశాంత్ నీల్ కూడా రాజమౌళిలా సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తాడనే పేరు ఉంది కాబట్టి.. కచ్చితంగా ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాలి.
Also Read: మహేష్ బాబు గ్లామర్ సీక్రెట్ చెప్పిన మంచు విష్ణు
ఎలాగూ ప్రభాస్ కూడా సలార్ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి.. రానున్న ఐదు నెలలు మొత్తం ప్రభాస్ సలార్ కోసమే కేటాయించనున్నాడు. అన్నట్టు ఈ మూవీలో ప్రభాస్ ని ఢీకొట్టడానికి విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారట. ఈ మేరకు ఈ స్టార్ తో సంప్రదింపులు కూడా జరిపినట్లుగా, త్వరలోనే దీనికి సంబందించిన అప్డేట్ అధికారకంగా ప్రకటిస్తారని కూడా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్