ఆచార్య సినిమాకు సంబంధించి రేపు ఉదయం 10:08 గంటలకు అదిరిపోయే అప్డేట్ విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో సిద్ద పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ కు సంబంధించి అప్డేట్ ఇవ్వనున్నట్లు క్లూ కూడా ఇచ్చింది. దీంతో రామ్ చరణ్ టీజర్ ను విడుదల చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్, పోస్టర్ల కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ అనౌన్స్ మెంట్ తో మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొంది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 న ఆచార్య చిత్రం విడుదల కానుంది. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే మలయాళం మూవీ ” లూసిఫర్ ” రీమేక్ గా తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటు మెహర్ రమేశ్ డైరెక్షన్ లో ” భోళా శంకర్ ”, బాబీతో మరో సినిమా చేయనున్నారు.
An update you are waiting for…
Tomorrow at 10:08 AM 💥💥#Siddha 💪#Acharya #AcharyaOnFeb4th— Konidela Pro Company (@KonidelaPro) November 23, 2021