Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రం శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వం లో రాబోతున్న సినిమా అనే సంగతి మన అందరికి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ నాల్గవ తేదీన ఈ సంచలన ప్రకటన వెలువడింది. ఈ చిత్రాన్ని ప్రముఖ హీరో నాని(Natural Star Nani) నిర్మిస్తున్నాడు. దసరా వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని చూసిన ఆడియన్స్, తమ అభిమాన హీరోలు ఇతని దర్శకత్వంలో సినిమా చేస్తే బాగుంటుందని కోరుకున్నారు. అలాంటి డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమాని ప్రకటించినప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వచ్చే ఏడాది నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుందని హీరో నాని నిన్న తానూ నిర్మించిన ‘కోర్ట్’ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో, రిపోర్టర్స్ అడగగా చెప్పుకొచ్చాడు.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం లో హీరోయిన్ గా బాలీవుడ్ సీనియర్ నటి రాణి ముఖర్జీ(Rani Mukherjee) నటించబోతున్నట్టు తెలుస్తుంది. రాణి ముఖర్జీ వయస్సు 46 ఏళ్ళు. చిరంజీవి వయస్సు ఈ ఏడాదితో 70 వ ఏటా లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆయన కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయినే తీసుకొస్తున్నారు గా, ఎందుకు ముదురు హీరోయిన్ అన్నారని మీకు అనిపించొచ్చు. చిరంజీవి వయస్సు పెద్దదే కానీ, చూసేందుకు చిన్న కుర్రాడి లాగా మారిపోయాడు. కానీ రాణీ ముఖర్జీ లుక్స్ ప్రస్తుతం ఆ రేంజ్ లో లేవు. దానికి తోడు ఆమె ఈమధ్య కాలం లో సినిమాలకు కాస్త దూరం గానే ఉంటుంది. అలాంటి ఆమెని ఎందుకు తీసుకొని రావడం, కాజోల్ దేవగన్ యాక్టీవ్ గానే సినిమాలు చేస్తూ వస్తుంది, ఆమెని తీసుకోవచ్చు కదా అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కానీ ఆ క్యారక్టర్ కి రాణి ముఖర్జీ తప్ప ఎవ్వరు న్యాయం చేయలేరని డైరెక్టర్ శ్రీకాంత్ బలంగా నమ్మడం వల్లే ఆమెని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర'(Vishwambhara Movie) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమా కి షిఫ్ట్ అవుతాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదలు కానుంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నానితో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. దీంతో పాటు ఆయన ‘దసరా’ కి సీక్వెల్ ని ప్రకటించి చాలా రోజులైంది. కానీ ఈ ప్రాజెక్ట్ ఆలోచనను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు సమాచారం. ఇక శ్రీకాంత్ ఓదెల తో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమా ఫుల్ యాక్షన్ జానర్ లో ఉండబోతుందని, సరికొత్త మెగాస్టార్ ని ఈ చిత్రం ద్వారా చూస్తారని ఓదెల ఇది వరకే ఒక ప్రకటన చేసాడు.