బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. త్వరలో నితీశ్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని హిల్సా స్థానంపై ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ జేడీయూ, ఆర్జేడీ లమధ్య కేవలం 12 ఓట్లు తేడాతోనే గెలుపోటములు జరిగాయి. ఎలక్షన్ కమిషనర్ వెబ్ సైట్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. జేడీయూ అభ్యర్థి కృష్ణకుమారి శరణ్ కు 61,848 ఓట్లు పోలయ్యాయి. ఆర్జేడీ అభ్యర్థి శక్తి సింగ్ యాదవ్ కు 61,836 ఓట్లు వచ్చాయి. వీరిద్దరి మధ్య కేవలం 12 ఓట్లు మాత్రమే తేడాతో ఆర్జేడీ సీటు కోల్పోయింది. అయితే తొలుత 547 ఓట్లతో శక్తి సింగ్ గెలుపొందారని చెప్పారని, ఆ తరువాత ఈ ఫలితాలను తారుమారు చేశారని ఆర్జేడీ ఆరోపించింది. అయితే లెక్కింపు పారదర్శకంగానే నిర్వహించామని ఎన్నికల అధికారులు తెలిపారు.