మనలో ప్రతి ఒక్కరూ కుంకుమ పువ్వు గురించి వినే ఉంటారు. చాలామంది కుంకుమ పువ్వును ఆడవాళ్లు మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటూ ఉంటారు. కానీ కుంకుమ పువ్వు వల్ల ఆడవాళ్లతో పాటు మగవాళ్లకు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మన దేశంలో జమ్మూకశ్మీర్ లో కుంకుమపువ్వును పండిస్తారు. మిగతా సుగంధద్రవ్యాలతో పోల్చి చూస్తే కుంకుమ పువ్వు ఖరీదు ఎక్కువ. రంగు, రుచి, వాసన ఉన్న గొప్ప ఔషధం కాబట్టి కుంకుమ పువ్వు ఖరీదు ఎక్కువ.
Also Read: చలికాలంలో బెల్లం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
వేడిపాలలో కుంకుమపువ్వును కలిపి తీసుకుంటే మనం అనేక రోగాల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. కుంకుమపువ్వులో ఉండే క్రోసిన్ నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్లకు ఆ సమస్యను దూరం చేస్తుంది. గోరువెచ్చని పాలతో కుంకుమపువ్వుతో పాటు కొంచెం తేనె కూడా కలిపి తీసుకుంటే మరీ మంచిది. స్థూలకాయం సమస్యతో బాధ పడేవాళ్లకు కుంకుమపువ్వు దివ్యౌషధంగా పని చేస్తుంది.
కుంకుమపువ్వులో ఉండే మాంగనీస్ మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. కుంకుమపువ్వులో ఉండే క్రోసిన్ జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రుతుక్రమం సమస్యతో బాధపడే వాళ్లు పాలలో కుంకుమపువ్వు కలిపి తీసుకుంటే రక్తస్రావం సమస్య దూరమవుతుంది. కుంకుమపువ్వులో ఉండే సెరోటెనిన్ ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: మీ బ్లడ్ గ్రూపు ఇది అయితే మీ ప్రాణాలు పోయినట్టే..
కుంకుమపువ్వులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కుంకుమపువ్వు హృదయసంబంధిత సమస్యలను దూరం చేయడంలో సైతం సహాయపడుతుంది. కుంకుమ పువ్వు జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది.