పార్టీ ఎంపీలతో కలిసి మోదీని కలుస్తా: శరద్ పవార్
వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు సహాయం చేయాలని మరో వారం రోజుల్లో ప్రధానమంత్రి మోదీని కలుస్తానని ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రకటించారు. వర్షాల కారణంగా కంకర్వాడీ, సస్తూర్, ఒస్మానాబాద్, మరాఠ్వాడా ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వారం రోజుల్లో పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లికి వెళ్తానన్నారు. అయితే వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల విషయంలో రైతులను ఆదుకునే విషయంతో రాష్ట్రప్రభుత్వానికి […]
Written By:
, Updated On : October 18, 2020 / 03:29 PM IST

వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు సహాయం చేయాలని మరో వారం రోజుల్లో ప్రధానమంత్రి మోదీని కలుస్తానని ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రకటించారు. వర్షాల కారణంగా కంకర్వాడీ, సస్తూర్, ఒస్మానాబాద్, మరాఠ్వాడా ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వారం రోజుల్లో పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లికి వెళ్తానన్నారు. అయితే వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల విషయంలో రైతులను ఆదుకునే విషయంతో రాష్ట్రప్రభుత్వానికి కొన్ని పరిమితులున్నాయని అందువల్ల కేంద్రప్రభుత్వ సాయం కావాలన్నారు.