ప్రస్తుతం భారత్లో కరోనా నివారణ కోసం రకరకాల వ్యక్సిన్లు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిరమ్ ఇనిస్టిట్యూట్ సంచలన ప్రకటన చేసింది. ఇండియాలో డిసెంబర్ నెల చివరి నాటికి 30 కోట్ల వ్యాక్సిన్లు సిద్ధమవుతాయని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ మేరకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ జాదవ్ ఆదివారం తెలిపారు. డీసీజీఐ నుంచి లైసెన్స్ రాగానే వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందుతాయన్నారు. చివరి పరీఓ జరుపుకున్న వ్యాక్సిన్ 2021 మార్చి నెలలో అందుబాటుకోకి వస్తుందన్నారు. నెలకు 7 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత్ కు ఉందన్నారు.