రోజారమణి, చక్రపాణి గార్లకు ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కరం

అమెరికా గానకోకిల శారద ఆకునూరి నిర్వహణలో వంశీ ఇంటర్నేషనల్ ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వర్చువల్‌ పద్దతిలో జరిగిన కార్యక్రమంలో స్వర్ణోత్సవ నటీమణి రోజారమణి, చక్రపాణి దంపతులకు ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారం 2020, అక్టోబర్ 17వ తేదీ సాయంత్రం అత్యంత వైభవంగ బహూకరించారు. వారి తనయుడు ప్రముఖ నటుడు తరుణ్, తనయ అమూల్య తల్లిదండ్రులకు శాలువా, పుష్పగుచ్చంతో జీవిత సాఫల్య పురస్కారంతో సత్కారించారు. Also Read: హీరో రామ్ […]

Written By: Neelambaram, Updated On : October 18, 2020 3:27 pm
Follow us on


అమెరికా గానకోకిల శారద ఆకునూరి నిర్వహణలో వంశీ ఇంటర్నేషనల్ ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వర్చువల్‌ పద్దతిలో జరిగిన కార్యక్రమంలో స్వర్ణోత్సవ నటీమణి రోజారమణి, చక్రపాణి దంపతులకు ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారం 2020, అక్టోబర్ 17వ తేదీ సాయంత్రం అత్యంత వైభవంగ బహూకరించారు. వారి తనయుడు ప్రముఖ నటుడు తరుణ్, తనయ అమూల్య తల్లిదండ్రులకు శాలువా, పుష్పగుచ్చంతో జీవిత సాఫల్య పురస్కారంతో సత్కారించారు.

Also Read: హీరో రామ్ స్ట్రామినా పెరిగింది.. నిర్మాతల్లో ఏంటీ మార్పు?

ఈ సందర్భంగా హీరో తరుణ్ మాట్లాడుతూ బాల్యంలో తన తల్లి భక్త ప్రహ్లాదలో నటించి జాతీయ పురస్కారం అందుకోవడం అదే విధంగా తను కూడా అంజలి చిత్రంలో బాలనటుడిగా జాతీయ పురస్కారం అందుకోవడం జీవితంలో ఒక మధుర స్మృతి అన్నారు. వంశీ సంస్థల వ్యవస్థాపకులు శిరోమణి వంశీ రామరాజు స్వాగతం పలికిన ఈ సభలో యునైటెడ్ కింగ్డమ్ తెలుగు సమాఖ్య ట్రస్టీ డా.వీపీ కిల్లి పరిచయ వ్యాఖ్యాలు పలికారు.

సభలో పాల్గొన్న పార్లమెంట్ మాజీ సభ్యులు సినీ నటులు నిర్మాత మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ రోజారమణితో తను వస్తాడే మా బావ, భారతంలో ఒక అమ్మాయిలో నటించానని గుర్తు చేశారు. ఆమె నటన వైదుష్యాన్ని ప్రశింసించారు. ఆమెను డబ్బింగ్ కళాకారిణిగా మొట్టమొదట తానే పరిచయం చేశానని తెలిపారు. 400 చిత్రాలకు పైగా సుహాసిని, రాధా, మీనా, విజయశాంతి వంటి హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారని తెలియజేశారు. అంతేగాక చక్రపాణి ఒరియాలో మనకు ఎన్‌టీఆర్ లాగా పౌరాణిక పాత్రల్లో నటించి ప్రశంసలందుకున్నారని అన్నారు. గాయని శారద ఆకునూరి తన పాటలతో మాటలతో చక్కటి వ్యాఖ్యానంతో అలరించారు.

Also Read: మెగాస్టార్ కు ఏమైంది.. ఇలా ఆలోచిస్తున్నాడు?

రోజారమణి మాట్లాడుతూ తమ జీవితమంతా కళలకు అంకితమైందని, కళల మయమైన జీవితం ఆనందాన్ని చేకూరుస్తుందని అన్నారు. చివరగా జరిగిన సంగీత కార్యక్రమంలో రాధిక నోరి(అమెరికా), రాజేంద్రప్రసాద్(వైజాగ్) తమ గానాన్ని వినిపించారు. డా. తెన్నేటి సుధా, శైలజ సుంకరపల్లి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.