
మరి కొన్ని వారాల్లోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం లోక్ సభ, రాజ్యసభలో ఉన్న విపక్ష నేతలతో వర్చువల్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. శాస్త్రవేత్తలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే భారత్ లో వ్యాక్సిన్ పంపిణీ సిద్ధం చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ పంపిణీపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ ప్రక్రియలో ఇతర దేశాల కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉందన్నారు.కోవిడ్ పై అన్ని రాజకీయ పార్టీలు తమ విలువైన సలహాలు ఇవ్వాలని కోరారు.