కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులపై పంజా విసురుతోంది. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నాయకులను వెంటాడిన కరోనా తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని విడిచిపెట్టలేదు. అయితే తాజాగా త్రివేంద్ర సింగ్ రావత్ కు శ్వాస ఇబ్బందులు తలెత్తడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. ఈనెల 18న ఆయనకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఆదివారం ఆయనకు తీవ్రంగా జ్వరం రావడంతో డెహ్రడూన్ లోని డూన్ ఆసుపత్రిలో చేర్పించారు. స్కానింగ్ చేసిన వైద్యులు ఛాతిలో ఇన్ ఫెక్షన్ గుర్తించారు. దీంతో ఆయనను ఎయిమ్స్ కు తరలించాలని సూచించారు. కాగా ముఖ్యమంత్రి సతీమణి, కూతరు కూడా కరోనా బారిన పడ్డారు. మరోవైపు ఈనెల 15న యూకే నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా నిర్దారణ అయిందని, వారి నుంచి వ్యాప్తి చెందుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.