https://oktelugu.com/

గర్వపడేలా చేశావు. లవ్ యూ విజయ్ !

టాలీవుడ్ లో డేరింగ్ డైరెక్టర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే వ్యక్తి పూరి జగన్నాథ్. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసే పూరి జగన్నాథ్ ఏం మాట్లాడినా ఆద్భుతంగానే ఉంటుంది. అయితే ప్రస్తుతం పూరీ తెరకెక్కిస్తున్న చిత్రం ఫైటర్‏. ఇప్పటికే చాలా భాగం షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పెద్ద బాక్సర్‏గా కనిపించబోతున్నాడు. పైగా తన పాత్ర కోసం విజయ్ దేవరకొండ జిమ్‏లో కఠినమైన కసరత్తులు కూడా చేస్తున్నాడు. ఈ కసరత్తులు చూసిన పూరి.. విజయ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 28, 2020 / 11:59 AM IST
    Follow us on


    టాలీవుడ్ లో డేరింగ్ డైరెక్టర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే వ్యక్తి పూరి జగన్నాథ్. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసే పూరి జగన్నాథ్ ఏం మాట్లాడినా ఆద్భుతంగానే ఉంటుంది. అయితే ప్రస్తుతం పూరీ తెరకెక్కిస్తున్న చిత్రం ఫైటర్‏. ఇప్పటికే చాలా భాగం షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పెద్ద బాక్సర్‏గా కనిపించబోతున్నాడు. పైగా తన పాత్ర కోసం విజయ్ దేవరకొండ జిమ్‏లో కఠినమైన కసరత్తులు కూడా చేస్తున్నాడు. ఈ కసరత్తులు చూసిన పూరి.. విజయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు.

    Also Read: డ్రగ్స్ పార్టీ.. అడ్డంగా బుక్ అయిన హీరోయిన్ !

    పూరి మాటల్లో.. “దటీజ్ మై హీరో, దటీజ్ మై ఫైటర్, నువ్వు నన్ను గర్వపడేలా చేశావు. లవ్ యూ విజయ్” అంటూ తన ట్విట్టర్‏లో విజయ్ జిమ్ చేస్తోన్న వీడియోను షేర్ చేస్తూ పూరీ పై విధంగా మెసేజ్ చేశాడు. నిజానికి హీరోలను కాకా పట్టడం పూరికి నచ్చని పని. పూరి ఏం మాట్లాడినా నిజమే చెబుతాడు. మరి విజయ్ కసరత్తులు పై పూరి నిజంగానే ఇంప్రెస్ అయ్యాడు అన్నమాట. ఇక కథలు కోసం సంవత్సరంపాటు గింజుకోవడం పూరికి అస్సలు నచ్చని పని. పూరి దృష్టిలో సినిమా షూటింగ్ అంటే మూడు నాలుగు నెలల్లో అయిపోవాలి. అందుకే టాలీవుడ్ లో పూరి ప్రత్యేకం.

    Also Read: ‘ఆచార్య’ సెట్ లో రామ్ చరణ్.. చెకింగ్ కోసమే!

    కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను జనవరి 5 నుండి హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో వేసిన బాక్సింగ్ సెట్ లో మొదలుకానుందని, ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ స్ తీయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొదలైన దగ్గర నుండి విజయ్ దేవరకొండ తన పాత్ర కోసం బాగా వర్కౌట్స్ చేస్తున్నాడు. పైగా బాలీవుడ్ సినిమా చేయాలని విజయ్ దేవరకొండ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఆ కారణంగానే విజయ్ ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు. అన్నట్టు అనన్య హీరోయిన్ గా వస్తోన్న ఈ సినిమాను కరణ్ జోహార్, పూరి, ఛార్మిలు కలిసి నిర్మిస్తుండటం విశేషం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్