కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా భారత్ నుంచి ప్రయాణికుల రాకపోకలపై విధించిన నిషేధాన్ని యూఏఈ జూన్ 30 వరకు పొడిగించింది. భారత్ లో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ఏప్రిల్ 25న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ నిషేధం విధించింది. జూన్ 14 వరకు ఆ ఆంక్షలు కొనసాగుతుాయని అప్పుడు ప్రకటించింది. అయితే ప్రస్తుతం దానిని మరో 16 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే యూఏఈ పౌరులు, యూఏఈ గోల్డెన్ వీసా కలిగినవారు, కొవిడ్ ప్రొటోకాల్ ను పాటించే దౌత్యవేత్తల ప్రయాణానికి మినహాయింపులు ఉంటాయిని తెలిపింది.