
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం ఢిల్లీకి బయలు దేరి వెళ్లడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రూపుతోంది. రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో కలిసి ఈటల సోమవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవుతారని, వీలుంటే అమిత్ షానే కూడా కలుస్తారని తెలుస్తోంది. అయితే సోమవారం బీజేపీలో చేరిక కార్యక్రమం ఉండకపోవచ్చని, కొన్ని విషయాలపై స్పష్టమైన హామీలు తీసుకుని హైదరాబాద్ తిరిగి వస్తారని సమాచారం. స్ఫష్టమైన హామీలు లభిస్తే, ఆ తర్వాత నిర్ణయాన్ని ప్రకటించి బీజేపీలో అట్టహాసంగా చేరేందుకు వీలుగా షెడ్యూల్ ను ఖరారరు చేసుకుంటారని తెలుస్తోంది.