Trump Putin Meeting Security Lapses: ఉక్రెయిన్ తో యుద్ధ విరమణ, వ్యాపార ఒప్పందాలు, ఇతర అంశాలకు సంబంధించి చర్చించడానికి అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్ ఈనెల 15న అలస్కాలో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీలో రకరకాల విషయాలు చర్చకు వచ్చినట్టు ట్రంప్, పుతిన్ చెప్పినప్పటికీ.. వాస్తవానికి ఈ సమావేశం అసంపూర్ణంగా ముగిసిందని గ్లోబల్ మీడియా చెబుతోంది. తదుపరి భేటీ మాస్కో లో జరుగుతుందని తెలుస్తోంది. తదుపరి ట్రంప్ యూరోపియన్ యూనియన్ దేశాలు, ఉక్రెయిన్ అధ్యక్షుడితో భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి.. ఏం జరిగిందనే విషయాన్ని పుతిన్, ట్రంప్ బయటికి చెప్పారు. కానీ వీరిద్దరూ భేటీ అయిన హోటల్లో కొన్ని రహస్య పత్రాలు ఇప్పుడు వెలుగులోకి రావడం సంచలనం కలిగిస్తోంది.
Also Read: సెలబ్రెటీల ‘కుక్కల’ ప్రేమ.. ఒక్క పోస్ట్ తో కడిగేసిన వర్మ..
అలస్కాలోని అంకరేజ్ హోటల్లో పుతిన్, ట్రంప్ భేటీ అయ్యారు. ఈ భేటీ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ గుర్తులు ఉన్నట్టుంది పత్రాలు బయటకు వచ్చాయి.. ఎన్పీఆర్ నివేదిక ప్రకారం 8 పేజీలలో సమావేశ షెడ్యూల్, సీటింగ్ ఏర్పాట్లు, సిబ్బంది పరిచయాలు, రష్యన్ అధికారుల పేర్లు ఫోనెటిక్ ఉచ్చారణ తో సహా సున్నితమైన లాజిస్టికల్ వివరాలు అందులో ఉన్నాయి.. ఆ పత్రాలను హోటల్ పబ్లిక్ ప్రింటర్లో వదిలిపెట్టినట్టు తెలుస్తోంది.. మొదటి పేజీలో జాయింట్ బేస్, ఎల్మండోర్ఫ్ – రిచర్డ్ సన్ మద్దు జరిగే కార్యక్రమాలను.. అవి జరిగే గదుల పేర్లను పొందుపరిచారు.. ట్రంప్ పుతిన్ కు బహుమతిగా ఇచ్చే అమెరికన్ బాల్డ్ ఈగల్ డెస్క్ విగ్రహాన్ని కూడా అందులో పేర్కొన్నారు.
రెండు నుంచి ఐదు పేజీలలో ముగ్గురు అమెరికన్ సిబ్బంది పేర్లు, వారి ఫోన్ నెంబర్లు నమోదు చేశారు. శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే 13 మంది అమెరికా, రష్యా అధికారుల పేర్లను పొందుపరిచారు.. ఈ జాబితాలో “Mr president POO – tihn” వంటి ఫొనెటిక్ గైడ్ ఏర్పాటు చేశారు. 6 నుంచి 7 పేజీలలో ” గొప్ప వ్యక్తి పుతిన్ గౌరవార్థం” అని శీర్షికన జరిగిన విందును వివరించాయి. ఇందులో సీటింగ్ చార్ట్, మెనూ వంటివి ఉన్నాయి. ట్రంప్ పక్కన విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబీయో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ వంటి సీనియర్ క్యాబినెట్ అధికారులు ఉన్నారు. టేబుల్ పక్కన పుతిన్ విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్, విదేశాంగ విధాన సహాయకుడు యూరి ఉషా కోవ్ కూర్చోవాలని పేర్కొన్నారు.
Also Read మన దేశ ప్రెసిడెంట్ వర్షంలో.. అదే అమెరికాలో వాళ్ళ ప్రెసిడెంట్ ని వర్షంలో తడవనిస్తారా?
భేటీలో ఏర్పాటుచేసిన మెనూలో గ్రీన్ సలాడ్, పైలెట్ మిగ్నాన్, హాలీబట్ ఒలంపియా, క్రీమ్ బ్రూలి ని సర్వ్ చేశారు. ఏం జరిగిందో తెలియదు కానీ లంచ్ మాత్రం రద్దు చేశారు.. చివరికి ఈ పత్రాలను ఎన్పీఆర్ సిబ్బంది, ముగ్గురు హోటల్ అతిధులు కెప్టెన్ కుక్ లోని షేర్డ్ ప్రింటర్ లో ఈ పత్రాలను కనుగొన్నారు. ప్రతీకారం, ఇతర భయాల వల్ల కొంతమంది అతిధుల పేర్లు బయట పెట్టకుండా ఉండాలని హోటల్ సిబ్బంది కోరినప్పటికీ.. అప్పటికే ఈ పత్రాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.. నిపుణులు మాత్రం దీనిని తీవ్రమైన లోపం అని వ్యాఖ్యానిస్తున్నారు.
” ఇది పరిపాలన ఆలసత్వం.. అసమర్థతకు నిదర్శనం.. మీరు ప్రింటర్లలో వస్తువులను వదిలేయడం నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇంత సులభంగా ఎలా వదిలివేసారంటూ”అమెరికా జాతీయ భద్రతను బోధించే UCLA లో న్యాయ ప్రొఫెసర్ జాన్ మైకేల్స్ వ్యాఖ్యానించారు. సరిగా ఈ వారం ప్రారంభంలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో గ్రూప్ చాట్ జరిగింది. ఒక నేరస్థుడి గురించి జరిగిన చాట్ లో యాదృచ్ఛికంగా బయట వ్యక్తిని చేర్చారు. ఆ బయటి వ్యక్తి ద్వారా ఈ చాట్ బహిర్గతమైంది. ఇప్పటివరకు ఈ ఘటనపై విచారణ సాగలేదు. జరిగిన సంఘటనకు ఎవరు బాధ్యులో ఇంతవరకు తేలలేదు. దాన్ని మర్చిపోకముందే అలాస్క హోటల్ లో కీలకమైన పత్రాలు లీక్ కావడం అమెరికాలో భద్రతా లోపం మరోసారి కళ్లకు కట్టింది.