Homeఆంధ్రప్రదేశ్‌Ram Gopal Varma Tweet: సెలబ్రెటీల ‘కుక్కల’ ప్రేమ.. ఒక్క పోస్ట్ తో కడిగేసిన వర్మ..

Ram Gopal Varma Tweet: సెలబ్రెటీల ‘కుక్కల’ ప్రేమ.. ఒక్క పోస్ట్ తో కడిగేసిన వర్మ..

Ram Gopal Varma Tweet: దేశ రాజధానిలో ఉంది వీధి శునకాలు పెరిగిపోతున్నాయని.. వాటి వల్ల ఇటీవల కాలంలో చివరికి చాలామంది గాయాల బారిన పడుతున్నారని.. అనూహ్యమైన సందర్భాలలో చనిపోతున్నారని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వీధి కుక్కలను షెల్టర్లలో తరలించాలని సూచించింది. అంతేకాదు ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పులో ప్రకటించింది.

Also Read: స్టార్ హీరో తో నిహారిక కొణిదెల డేటింగ్..ఊహించని కాంబినేషన్ ఇది!

దేశ సర్వన్నత న్యాయస్థానం ఆ విధంగా తీర్పు చెప్పిన తర్వాత.. ఢిల్లీ అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు సమాయత్తమైంది. హస్తినలో ఉన్న వీధి శునకాలపై సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పు వెల్లడించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ముఖ్యంగా సెలబ్రిటీలు రెచ్చిపోయారు. శునకాల విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం అటువంటి నిర్ణయం తీసుకోవడం సరికాదు అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. సినీ నటి సదా అయితే ఏకంగా ఏడ్చేశారు. కపిల్ దేవ్ లాంటివారు కూడా సర్వోన్నత న్యాయస్థానం తీర్పును పునః సమీక్షించాలని సూచించారు.

ఊరందరిదీ ఒక దారి అయితే.. ఉలిపి కట్టేది మరొక దారి అన్నట్టుగా సెలబ్రిటీలు మొత్తం ఢిల్లీ శునకాల గురించి మాట్లాడుతుంటే.. సుప్రసిద్ధ దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం తనదైన సెటైరికల్ వీడియోతో సెలబ్రిటీల నోరు మూయించాడు.. వీధి శునకాల దాడుల వల్ల దేశవ్యాప్తంగా ఎంతోమంది చనిపోతున్నారని.. గతంలో వీధి శునకాల దాడులకు సంబంధించిన దృశ్యాలను ఒక వీడియో రూపంలో వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వాస్తవానికి ఇటువంటి విషయాల మీద వర్మ తనదైన శైలిలో స్పందిస్తారు. దానికి తగ్గట్టుగానే సెటైరికల్ ట్వీట్ చేస్తారు. కానీ ఈసారి ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండానే ఒక వీడియో రూపంలోనే తన అనుకున్న విషయాన్ని మొత్తం చెప్పగలిగారు.. హస్తినలో వీధి శునకాలకు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మనదేశంలో పేరుపొందిన వ్యక్తులు రకరకాలుగా స్పందించారు. వీధి శునకాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం అలా చేసి ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడారు. సమాజంలో పేరుపొందిన వ్యక్తులు అలా మాట్లాడడాన్ని మరికొంతమంది తప్పు పట్టారు.. ఇలా రకరకాలుగా సం వాదాలు కొనసాగుతుండగానే.. వర్మ ఇలా స్పందించడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version