President Droupadi Murmu in Heavy Rain: ప్రపంచంలో కొన్ని మినహా అన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం నడుస్తోంది. ప్రజాస్వామ్యం నిర్వచనం ప్రకారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంటుంది. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి పరిపాలన సాగిస్తూ ఉంటారు. మనదేశంలో అయితే ప్రధానమంత్రి ప్రధాన పరిపాలకుడిగా ఉంటాడు. అదే అమెరికా లాంటి దేశం అయితే అక్కడ అధ్యక్షుడు సుప్రీం గా ఉంటాడు. మన దేశంలో కూడా రాష్ట్రపతి దేశానికి అధ్యక్ష స్థానంలో ఉన్నప్పటికీ.. దేశాన్ని పరిపాలించే అధికారం మాత్రం ఉండదు. రాష్ట్రపతి మన దేశానికి ప్రధమ పౌరుడుగా ఉంటారు. కీలకమైన బిల్లులు, ఇతర చట్టాలు.. వ్యవహారం మొత్తం రాష్ట్రపతి చేతిలోనే ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తేనే అవి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం మన దేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము కొనసాగుతున్నారు. ఆదివాసి మహిళగా.. ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రంలో పుట్టిన ఆమె అంచలంచలుగా ఎదిగి రాష్ట్రపతి స్థాయి దాకా వచ్చారు.
భర్తను కోల్పోయారు, పిల్లల్ని కూడా కోల్పోయారు. ప్రస్తుతం ఉన్న ఒక్క గానొక్క కుమార్తెనే ఆమెకు ఆలంబన. నిరాడంబరమైన జీవిత శైలిని అనుసరించే ద్రౌపది.. శివుడిని అమితంగా ఆరాధిస్తుంటారు. దేశానికి సంబంధించి రాష్ట్రపతి హోదాలో ఉన్నప్పటికీ ఆమె హంగు ఆర్భాటాలను ప్రదర్శించరు. శుక్రవారం ఎర్రకోటలో స్వాతంత్ర వేడుకలు జరిగినప్పుడు.. ద్రౌపతి అక్కడికి హాజరయ్యారు. ఈ సమయంలో ఢిల్లీ ప్రాంతంలో బీభత్సమైన వర్షం కురిసింది. అంత వర్షంలో తడుస్తూనే ఆమె స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ సిబ్బందికి నివాళులర్పించి.. వారి కుటుంబ సభ్యులకు పురస్కారాలను ప్రధానం చేశారు. ఈ క్రతువు మొత్తాన్ని రాష్ట్రపతి వర్షంలో తడుస్తూనే చేయడం విశేషం. గొడుగుల రక్షణ కల్పించేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తుండగా ఆమె వారించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమెతోపాటు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా వర్షంలో తడుస్తూనే అమరులకు నివాళులర్పించడం విశేషం
Also Read: మోడీ ప్రభుత్వం సాధించిన టాప్ 10 ఆర్థిక విజయాలు
మనదేశంలో ఇలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడికి ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైతే అక్కడ వెంటనే గొడుగులు ఏర్పాటు చేస్తుంటారు. అధ్యక్షుడికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూస్తుంటారు. అక్కడ దాకా ఎందుకు శ్వేత దేశ అధిపతి ఇతర దేశాల్లో పర్యటించడానికి వెళ్తే.. ప్రత్యేకమైన విమానంలో అధ్యక్షుల వారి వాహనాలు.. సెక్యూరిటీ వెళ్తుంటారు. చివరికి అధ్యక్షుడు తినే ఆహారాన్ని కూడా అమెరికా నుంచి వెళ్ళిన సిబ్బంది పర్యవేక్షిస్తారు. వారి స్వయంగా వండి పెడుతుంటారు. పొరుగు దేశాలలో కనీస ఆహారాన్ని ముట్టను కూడా ముట్టరు. అత్యంత పకడ్బందీ సెక్యూరిటీ కల్పించి అధ్యక్షుడిని నిత్యం కాచుకొని ఉంటారు. మనదేశంలో అయితే స్వాతంత్ర్య వేడుకల్లో రాష్ట్రపతి తడుస్తున్నప్పటికీ.. ఇటువంటి రక్షణ చర్యలు తీసుకోవద్దని సూచించారు. కానీ అమెరికాలో అలా కాదు. చిన్నపాటి వర్షం కురిసినా.. హిమపాతం సంభవించినా వెంటనే సిబ్బంది అలర్ట్ అయిపోతుంటారు.