Local AC Train In Kolkata: ఒకప్పుడు మేధావులు ఉండేవారు. వారు ఏ విషయంపై నైనా అనర్గళంగా మాట్లాడేవారు. ఇప్పుడు వారి స్థానంలో ఇన్ఫ్లుయన్సర్స్ వచ్చారు. సోషల్ మీడియా వల్ల ఇన్ఫ్లుయన్సర్స్ కు ఆదాయం బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో రకరకాల మాధ్యమాలు ఆదాయానికి మార్గాలుగా ఉన్నాయి. దీంతో రకరకాల ప్రయోగాలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా దండిగా సంపాదిస్తున్నారు ఇన్ఫ్లుయన్సర్స్. ఆదాయం భారీగా ఉండడంతో ఇన్ఫ్లుయన్సర్స్ సంఖ్య పెరుగుతున్నది. చాలామంది దీనిని ఒక కెరియర్ గా మలుచుకుంటున్నారు. ఓ నివేదిక ప్రకారం వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఆదాయాన్ని భారీగా ఆర్జించే వారిలో మన దేశానికి సంబంధించిన ఇన్ఫ్లుయన్సర్స్ సింహభాగం వరకు ఉంటారని తెలుస్తోంది.
Also Read: అలాస్కా లో రహస్య పత్రాలు.. ట్రంప్, పుతిన్ భేటీ లో ఇన్ని భద్రతా లోపాలా?
మనదేశంలో ఇన్ఫ్లుయన్సర్స్ పెరిగిపోయారు అని చెప్పడానికి ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా నగరంలో జరిగిన ఓ సంఘటన బలమైన నిదర్శనం గా నిలిచింది.. ఇటీవల కోల్ కతా నగరంలో లోకల్ ఏసీ ట్రైన్ ను ప్రారంభించారు. దీనిని వీడియో తీసేందుకు వందలమంది యూట్యూబర్లు అందులోకి ఎక్కారు. వాస్తవానికి ట్రైన్ ఎక్కే ప్రయాణికుల కంటే యూట్యూబర్లు అధికంగా ఉండడం విశేషం.. ట్రైన్ ఎక్కడం.. అందులో ఉన్న విశేషాలను చెప్పడం.. ప్రయాణికులతో మాట్లాడడం.. వంటి కార్యకలాపాలతో యూట్యూబర్లు సందడి చేశారు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. సోషల్ మీడియా వ్యాప్తి.. సోషల్ మీడియా విస్తృతి అధికంగా ఉండడం వల్ల దీనిని ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీని ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలనే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటున్నది.
ప్రభుత్వాలు ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో ఇవ్వకపోవడం.. ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగాలకు స్థిరత్వం లేకపోవడంతో చాలామంది సోషల్ మీడియాను ఒక కెరియర్ లాగా మార్చుకుంటున్నారు. అందులోనే ఎంతోకొంత సంపాదించాలని భావిస్తున్నారు. ప్రధాన మాధ్యమం దిక్కులు చూస్తున్న వేళ.. సోషల్ మీడియా జడలు విప్పి నాట్యం చేస్తోంది. పైగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు సోషల్ మీడియా ద్వారానే తమ ప్రచారాన్ని చేస్తున్నాయి. తమ ప్రకటనలను కూడా యూట్యూబర్ల ద్వారా ప్రచారం కల్పిస్తున్నాయి. అందువల్ల యూట్యూబర్లకు చేతినిండా పని ఉంటున్నది. దండిగా ఆదాయం లభిస్తున్నది.. కోల్ కతా లో లోకల్ ఏసీ ట్రైన్ మాత్రమే కాదు.. మన దేశంలో ఏ చిన్న సంఘటన జరిగినా సరే యూట్యూబర్లు వాలిపోతున్నారు.. ప్రధాన మీడియా పట్టుకోలేనిది.. వారు క్యాచ్ చేస్తున్నారు. దానిని సోషల్ మీడియాలో పెట్టి దర్జాగా క్యాష్ చేసుకుంటున్నారు.
Kolkata joins the AC Local Train Club after Mumbai & Chennai! Bengal’s First AC Local Train has been Inaugurated Today!
Ranaghat 8:29 am → Sealdah 10:10 am
Sealdah 6:50 pm → Ranaghat 8:32 pm
Fares ₹35–₹120, Passes ₹620–₹2430Cooler, Comfier, Faster rides begin Aug 11! pic.twitter.com/12hwItfuyt
— নক্ষত্র | Nakshatra ❁ (@BombagorerRaja) August 10, 2025