మోదీకి ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించిన ట్రంప్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించింది. వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న డోనాల్డ్ ట్రంప్ ‘లీజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డును మోదీకి ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ భారత్ గ్లోబల్ పవర్ గా ఎదుగుతోందన్నారు. ఈ అవార్డును ప్రభుత్వ అధినేతలకు మాత్రమే ఇస్తామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్టు ఓ బ్రియన్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ఇండియా, అమెరికాల మధ్య సంబంధాలు బలపడడం […]

Written By: Suresh, Updated On : December 22, 2020 10:52 am
Follow us on

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించింది. వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న డోనాల్డ్ ట్రంప్ ‘లీజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డును మోదీకి ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ భారత్ గ్లోబల్ పవర్ గా ఎదుగుతోందన్నారు. ఈ అవార్డును ప్రభుత్వ అధినేతలకు మాత్రమే ఇస్తామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్టు ఓ బ్రియన్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ఇండియా, అమెరికాల మధ్య సంబంధాలు బలపడడం వెనుక మోదీ ఎంతో క్రుషి చేశారని కొనియాడారు. కాగా 2016లో సౌదీ అరెబియా ప్రభుత్వం ‘ఆర్డర్ ఆఫ్ అబ్దుల్లాజీజ్ అల్ సౌద్’, 2019లో రష్టా ప్రభుత్వం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్’ ను, యూఏఈ ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్ అవార్డు’ను ప్రకటించాయి.