https://oktelugu.com/

వైసీపీపై పోలీసుల స్వామి భక్తి సల్లగుండా?

ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ ఇప్పటికే వివాదాల్లో చిక్కుకుంటున్న ఏపీ సీఎం జగన్‌ మరోసారి వివాదంలోకి నెట్టివేయబడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలకు కోట్లు వెచ్చించి వైసీపీ రంగులేయడం వివాదస్పదమైంది. దీనిని కోర్టులు కూడా తప్పుబట్టాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. చివరకు కార్యాలయాలకు వేసిన రంగులను మార్చేశారు. అప్పట్లో ప్రభుత్వ కార్యాలయాలతోపాటే ‘దిశ’స్టేషన్లకూ వైసీపీ రంగులు పులిమారు. చివరకు వాటిని కూడా మార్చాల్సి వచ్చింది. Also Read: సోము వీర్రాజును వాళ్లు టార్గెట్ చేస్తున్నారా? అలాగే.. మహిళల రక్షణ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 22, 2020 / 10:44 AM IST
    Follow us on

    ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ ఇప్పటికే వివాదాల్లో చిక్కుకుంటున్న ఏపీ సీఎం జగన్‌ మరోసారి వివాదంలోకి నెట్టివేయబడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలకు కోట్లు వెచ్చించి వైసీపీ రంగులేయడం వివాదస్పదమైంది. దీనిని కోర్టులు కూడా తప్పుబట్టాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. చివరకు కార్యాలయాలకు వేసిన రంగులను మార్చేశారు. అప్పట్లో ప్రభుత్వ కార్యాలయాలతోపాటే ‘దిశ’స్టేషన్లకూ వైసీపీ రంగులు పులిమారు. చివరకు వాటిని కూడా మార్చాల్సి వచ్చింది.

    Also Read: సోము వీర్రాజును వాళ్లు టార్గెట్ చేస్తున్నారా?

    అలాగే.. మహిళల రక్షణ కోసం అంటూ ప్రారంభించిన దిశ యాప్‌కు కూడా వైసీపీ రంగులే వేశారు. రంగుల విషయంలో ఇంత వివాదం జరిగినప్పటికీ తాజాగా పోలీస్‌ వాహనాలకూ మరోసారి వైసీపీ రంగులేశారు. సీఎం పుట్టిన రోజు కానుక అన్నట్లుగా గుంటూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

    Also Read: ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్

    దిశ వాహనాలకే కాకుండా, గతంలో కేంద్ర ప్రభుత్వం ‘శక్తి’ పేరుతో ప్రతి స్టేషన్‌కూ మహిళా ఎస్‌ఐలకు కేటాయించిన బైక్‌లకూ వైసీపీ స్టిక్కర్లు అంటించి దిశ పేరుతో ప్రారంభించారు. సోమవారం గుంటూరులోని పోలీస్‌ కార్యాలయంలో అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి ఈ వాహనాలను జెండా ఊపి అట్టహాసంగా ప్రారంభించారు. పాతవి కావడంతో రెండు వాహనాలు మొరాయించాయి. మరి వీటిపైనే ఎవరో ఒకరు రాద్ధాంతం చేస్తే మళ్లీ ఆ స్టిక్కర్లను కూడా తొలగించాల్సి వస్తుందేమో జగన్‌ బాబు.. ఒకసారి ముందే అలర్ట్‌ అవ్వండి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్