పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో త్రుణమూల్, బీజేపీల మధ్య శనివారం ఘర్షణ వాతావరణం నెలకొంది. టీఎంసీ నుంచి రెండు రోజుల కిందట బీజేపీలో చేరిన ఎంపీ సునీల్ మోండల్ శనివారం బీజేపీ కార్యాలయానికి వచ్చారు. ఈ సమయంలో త్రుణమూల్ కార్యకర్తలు ఆయన కారును అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమయంలో టీఎంసీ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. అయితే అక్కడా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినా వాటిని తోసేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా టీఎంసీ నాయకులు తమ నిరసనను కొనసాగించారు.