https://oktelugu.com/

డబుల్ గ్లామర్ డోస్ తో వైట్లకు హిట్ వస్తోందా ?

ప్లాప్ లతో ఇమేజ్ పోయి.. చివరకు సినిమా సెట్ చేసుకోవడానికి కిందామీదా పడిన శ్రీను వైట్ల, మొత్తానికి షూటింగ్ కి రెడీ అయిపోయాడు. లాంగ్ గ్యాప్ తర్వాత మంచు విష్ణు-శ్రీనువైట్ల కాంబినేషన్ లో రాబోతున్న “డిడి (డబుల్ డోస్)” మూవీలో అను ఎమ్మాన్యుయేల్, ప్రగ్యా జైశ్వాల్ ను హీరోయిన్లుగా తీసుకుంటున్నారట. డబల్ డోస్ అంటే వినోదమే అనుకున్నాం.. గ్లామర్ డోస్ కూడా రెండింతలు ఉండబోతుంది అన్నమాట. అను మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు తెగ తాపత్రయ […]

Written By:
  • admin
  • , Updated On : December 26, 2020 / 01:25 PM IST
    Follow us on


    ప్లాప్ లతో ఇమేజ్ పోయి.. చివరకు సినిమా సెట్ చేసుకోవడానికి కిందామీదా పడిన శ్రీను వైట్ల, మొత్తానికి షూటింగ్ కి రెడీ అయిపోయాడు. లాంగ్ గ్యాప్ తర్వాత మంచు విష్ణు-శ్రీనువైట్ల కాంబినేషన్ లో రాబోతున్న “డిడి (డబుల్ డోస్)” మూవీలో అను ఎమ్మాన్యుయేల్, ప్రగ్యా జైశ్వాల్ ను హీరోయిన్లుగా తీసుకుంటున్నారట. డబల్ డోస్ అంటే వినోదమే అనుకున్నాం.. గ్లామర్ డోస్ కూడా రెండింతలు ఉండబోతుంది అన్నమాట. అను మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు తెగ తాపత్రయ పడుతుంది. ఇప్పటికే తెలుగులో “మహా సముద్రం”, “అల్లుడు అదుర్స్” సినిమాలు చేస్తోంది.

    Also Read: మరో ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌‌లో సునీల్‌

    ఇప్పుడు ఈ మూవీ కూడా యాడ్ అవుతోంది. ఇక మంచు విష్ణు, అను ఎమ్మాన్యుయేల్ ది ఫ్రెష్ కాంబినేషన్. అటు విష్ణు-ప్రగ్యా మాత్రం గతంలో ఓ సినిమా చేశారు. ఏది ఏమైనా అను, ప్రగ్య ఇద్దరూ అందాలు ఆరబోయటంలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోరు. దర్శకుడు కోరాలే గాని బికినీ షోలతో యూత్ కి మంచి కమర్షియల్ హంగులు చూపిస్తారు. దీనికి తోడు కామెడీకి గ్లామర్ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించడంలో దర్శకుడు శ్రీను వైట్లది ప్రత్యేక శైలి. ఒకప్పుడు ఈయన సినిమా వచ్చిందంటే కచ్చితంగా బాక్సాఫీస్ బద్ధలైపోయేది అనే రేంజ్ లో కమర్షియల్ సినిమాలు అందించిన హిస్టరీ శ్రీను వైట్లది.

    Also Read: బోల్డ్ స్టోరీలో మాజీ బబ్లీ బ్యూటీ !

    అయితే వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి.. వరుస ప్లాప్ లు ఇవ్వడంతో శ్రీను వైట్ల ఫేట్ మారింది. ఫేడవుట్ అయిపోయాడు. ఐదేళ్ల కింది వరకు శ్రీను వైట్ల అంటే హిట్ సినిమాల దర్శకుడు అనే బ్రాండ్ ఉండేది. కానీ ఆగడు నుంచి మనోడి సీన్ సితార అయిపోవడంతో ప్రస్తుతం చిన్న హీరోలు కూడా మనోడిని పట్టించుకోవడం లేదు. 2014లో వచ్చిన ఆగడు నుంచి శ్రీను వైట్ల టైమ్ పూర్తిగా టర్న్ అయి చివరకు విష్ణు దగ్గర ఆగాడు. ఈ సినిమా కూడా పోతే ఇక శ్రీను వైట్లకు మరో సినిమా రావడం కష్తమే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్