https://oktelugu.com/

మహేష్ కోసం హైదరాబద్ లో ‘అమెరికా బ్యాంక్’.. !

సూపర్ స్టార్ మహేష్ బాబు – పరుశురామ్ కలయికలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా బ్యాంక్ సెట్ వర్క్ స్టార్ట్ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. మొదట అమెరికాలో షూటింగ్ ప్లాన్ చేసినా, వీసాలు రావ‌డం స‌మ‌స్య‌గా మార‌డంతో అక్క‌డి షెడ్యూల్ వాయిదా వేసి.. బ్యాంకు నేప‌థ్యంలో సాగే కీల‌క‌మైన ఎపిసోడ్ తీస్తున్నారు. కాగా ఆ […]

Written By:
  • admin
  • , Updated On : December 26, 2020 / 01:33 PM IST
    Follow us on


    సూపర్ స్టార్ మహేష్ బాబు – పరుశురామ్ కలయికలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా బ్యాంక్ సెట్ వర్క్ స్టార్ట్ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. మొదట అమెరికాలో షూటింగ్ ప్లాన్ చేసినా, వీసాలు రావ‌డం స‌మ‌స్య‌గా మార‌డంతో అక్క‌డి షెడ్యూల్ వాయిదా వేసి.. బ్యాంకు నేప‌థ్యంలో సాగే కీల‌క‌మైన ఎపిసోడ్ తీస్తున్నారు. కాగా ఆ బ్యాంకు సెట్‌ ను తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో వేస్తున్నారు.

    Also Read: డబుల్ గ్లామర్ డోస్ తో వైట్లకు హిట్ వస్తోందా ?

    అయితే బ్యాంకు ఎక్స్‌టీరియ‌ర్ కి సంబంధించిన స‌న్నివేశాల్ని అమెరికాలోనే తీస్తారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన బ్యాంకు కూడా అమెరికాలో వెతికి ఫైనల్ చేసారట. అన్నట్టు సినిమాలో ఓపెనింగ్ సన్నివేశాలు అన్ని ఈ బ్యాంక్ సెట్ లోనే జరుగుతాయి. ఇక ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకుగా నటించబోతున్నాడు. అంటే తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది సినిమాలో మెయిన్ కంటెంట్ అని.. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూనే సాగుతోందని తెలుస్తోంది.

    Also Read: మరో ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌‌లో సునీల్‌

    అయితే ఈ సినిమా సీరియస్ టోన్ లో సాగకుండా కాస్త కామెడీ యాంగిల్ లోనే ఉంటుంది. అనగా మహేష్ వేసే ప్లాన్స్ చుట్టూ వచ్చే సీన్స్ ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటాయి. అలాగే ఈ సినిమాలో ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని.. మహేష్ అభిమానులకు ఈ లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుందని.. అన్నిటికి మించి చాలా కాలం తర్వాత మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్‌ గా కనిపించబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. కాగా ఈ లవర్ బాయ్ లుక్ కోసమే, మహేష్ తన హెయిర్ స్టైల్ ను కూడా కొత్తగా మార్చుకున్నాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్