ఈసారి గణతంత్ర వేడుకల్లో 25 వేల మందికే అనుమతి

రాబోయే జనవరి 26న దేశరాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించే గణంత్ర వేడుకలు విభిన్నంగా కనిపించనున్నాయి. కరోనా మహమ్మారి కాటేస్తున్న వేళ పలు జాగ్రత్తలతో గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. 2020 జనవరి 26న జరిగిన గణతంత్ర వేడుకలతో పోల్చిచూస్తే… ఈసారి పరేడ్‌లో మార్చింగ్, విన్యాసాలు చాలా తక్కువగా కనిపించనున్నాయి. దీనితోపాటు సందర్శకుల సంఖ్యపై పరిమితి కూడా విధించారు. ఈసారి గణంత్ర వేడుకలకు 25 వేల మంది సందర్శకులకు మాత్రమే అనుమతినివ్వనున్నారు. గతంలో గణతంత్ర ఉత్సవాలకు లక్షమంది వరకూ హాజరయ్యేందుకు […]

Written By: Suresh, Updated On : December 31, 2020 8:48 am
Follow us on

రాబోయే జనవరి 26న దేశరాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించే గణంత్ర వేడుకలు విభిన్నంగా కనిపించనున్నాయి. కరోనా మహమ్మారి కాటేస్తున్న వేళ పలు జాగ్రత్తలతో గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. 2020 జనవరి 26న జరిగిన గణతంత్ర వేడుకలతో పోల్చిచూస్తే… ఈసారి పరేడ్‌లో మార్చింగ్, విన్యాసాలు చాలా తక్కువగా కనిపించనున్నాయి. దీనితోపాటు సందర్శకుల సంఖ్యపై పరిమితి కూడా విధించారు. ఈసారి గణంత్ర వేడుకలకు 25 వేల మంది సందర్శకులకు మాత్రమే అనుమతినివ్వనున్నారు. గతంలో గణతంత్ర ఉత్సవాలకు లక్షమంది వరకూ హాజరయ్యేందుకు అవకాశం కల్పించేవారు.