https://oktelugu.com/

చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖపై హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ తాజాగా ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ లేఖ రాయడం ద్వారా అనుచిత లబ్ధి పొందడంలో విజయవంతమయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తుల విషయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ రాకేష్ కుమార్ వైదొలగాలంటూ ఆ సంస్థ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ వేసిన పిటీషన్ ను కొట్టివేస్తూ ఇచ్చిన […]

Written By:
  • NARESH
  • , Updated On : December 31, 2020 / 08:50 AM IST
    Follow us on

    హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ తాజాగా ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ లేఖ రాయడం ద్వారా అనుచిత లబ్ధి పొందడంలో విజయవంతమయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తుల విషయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ రాకేష్ కుమార్ వైదొలగాలంటూ ఆ సంస్థ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ వేసిన పిటీషన్ ను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

    Also Read: టీడీపీ నేత శవంతో ప్రొద్దుటూరులో లోకేష్ పోరుబాట.. ఉద్రిక్తం

    ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులు, ఓ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ జగన్ రాసిన లేఖ వల్ల ఏపీ సీఎం అంతిమంగా ఊరట పొందుతారో లేదో తెలియదు కానీ దాని వల్లే ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీ జరిగిందని ప్రజలు భావించే అవకాశం ఉందని జస్టిస్ రాకేష్ కుమార్ సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు.

    జడ్జీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీబీఐ దర్యాప్తును ఆదేశించారని.. ఆ తర్వాతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జగన్ రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారని జస్టిస్ రాకేష్ కుమార్ వివరించారు.

    ఈ క్రమంలోనే జగన్ కేసులపై కూడా జస్టిస్ రాకేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేయడం వల్ల సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్ పై కేసుల విచారణలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని.. వాటిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణకు అవరోధం ఏర్పడవచ్చని జస్టిస్ రాకేష్ కుమార్ అభిప్రాయపడ్డారు.

    Also Read: దారుణం.. గంటల చొప్పున భార్యను అమ్మకానికి పెట్టిన భర్త..!

    సీఎం జగన్ రాసిన లేఖతో ఏపీ చీఫ్ జస్టిస్ బదిలీ అవుతున్నారని.. దీనివల్ల మూడు రాజధానులపై విచారణ మొదటికొస్తుందని.. అమరావతి మళ్లీ మొదటికొస్తుందని జస్టిస్ రాకేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    అటు న్యాయవ్యవస్థను.. ఎలక్షన్ కమిషన్ ను, శాసనమండలి రద్దు చేసి వ్యవస్తలను దెబ్బతీయడంలో జగన్ ప్రభుత్వం విజయం సాధించిందని జస్టిస్ రాకేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ హైకోర్టుల బదిలీల్లో పారదర్శక ఉండాలని పేర్కొన్నారు.

    ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి సంబంధించిన కేసులో ఏకంగా హైకోర్టు జడ్జిపైనే ఓ ఐఏఎస్ పిటీషన్ వేయడం.. వైదొలగాలని కోరడం ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ వల్ల జరిగిన పరిణామాలతోనే జరిగాయని జస్టిస్ రాకేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్