
సూపర్ స్టార్ రజనీకాంత్ హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు. ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని హైబీపీ మాత్రమే ఉందన్నారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుందని బీపీలో హెచ్చు తగ్గుదలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. బీపీ అదుపులోకి రాగానే డిశ్చార్జి చేస్తామన్నారు. రక్త సరఫరాలో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల రజినీకాంత్ కు ఈ పరిస్థితి వచ్చింది అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన మరో రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని అపోలో ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. మరోసారి రజినీకి కోవిడ్ పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే హార్ట్ కు సంబంధించిన పరీక్షలు చేయబోతున్నట్టు తెలిపారు.