తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఆ పథకాలు అమలు చేస్తున్నాం.. ఈ పథకాలు అమలు చేస్తున్నాం అని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ పాచిక పారడం లేదా..? ఆ సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వానికి కలిసి రావడం లేదా..? అక్కడి ఓటర్లు పథకాలను పట్టించుకోవడం లేదా..? ప్రజల్లో టీఆర్‌ఎస్ పట్ల ఎందుకింత వ్యతిరేకత ఎందుకు వచ్చినట్లు..? అసలు ఎక్కడ లోపం జరుగుతోంది..? ఇప్పుడు ఇదే ప్రశ్నలపై టీఆర్‌ఎస్ మేధోమథనం మొదలైందట. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చిందని సీనియర్ నేతలంతా చర్చిస్తున్నారు.
Also Read: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావు?
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూసి ప్రజలంతా తమవైపు ఉంటారని మొదటి నుంచీ టీఆర్‌ఎస్ భావన. కానీ.. ఇప్పుడు అదంతా రివర్స్ అయింది. దుబ్బాక బై పోల్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు టీఆర్‌ఎస్ అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, రైతుబంధు, పింఛన్లు, పక్కా ఇళ్లు.. వీటినే అస్త్రాలుగా ప్రయోగించింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలోనూ సంక్షేమ పథకాలే తమను గట్టెక్కించాయని నేతలు గట్టిగా విశ్వసించారు. కానీ.. ఇప్పుడు ఎందుకో ప్రజల్లో ఆ నమ్మకం సడలించింది.
మరోవైపు.. దుబ్బాక ఎన్నికల ఫలితాలతో గులాబీ నేతలు లెక్కలు వేయడం ప్రారంభించారు. దుబ్బాక నియోజకవర్గంలో వివిధ పథకాల కింద లక్షా 30 వేల మంది వరకూ ఉన్నారట. ఈ లెక్కలు వేసుకుని దుబ్బాకలో తమ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ నేతలు ముందు నుంచీ కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. అయితే.. ప్రభుత్వ పథకాలను పొందుతున్న లబ్ధిదారుల్లో సగం మంది కూడా టీఆర్ఎస్ కు ఓటు వేయలేదు.
Also Read: హైఅలెర్ట్: బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన 16మందికి కరోనా
ఇక ఆ ఓటమితో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వర్కవుట్ కావని టీఆర్‌ఎస్ నేతలు నిర్ణయానికి వచ్చారట. ఇక ప్రజల్లోనే ఉండాలని కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆదేశించారు. నెలలో పదిహేను రోజుల పాటు గ్రామాల పర్యటన చేపట్టాలని కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలను సూచించినట్లు తెలిసింది. ముఖ్యమైన సమస్యలను గుర్తించి సత్వరం పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఒక్క ఓటమితో మరెన్నో గుణపాఠాలు అన్నట్లు.. దుబ్బాక ఓటమితో టీఆర్‌ఎస్‌లో మార్పు మాత్రం బాగానే కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్