
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలోని శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి తన అనుచరుడైన వైసీపీ నేత రజాక్ అనే వ్యక్తిని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నాడని రాజాసింగ్ ఆరోపించారు. అక్కడ కాంట్రాక్టులు పొందారని విమర్శించారు. ఈ విమర్శలపై తాజాగా రజాక్ స్పందించాడు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ రాజాసింగ్ కు ఓపెన్ చాలెంజ్ చేశారు.ఒకవేళ ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన సవాల్ చేశారు.దీనికి రాజాసింగ్ సిద్ధమా అని ప్రశ్నించారు.