Homeజాతీయం - అంతర్జాతీయం2008 తర్వాత కోహ్లీకిదే తొలిసారి

2008 తర్వాత కోహ్లీకిదే తొలిసారి

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ 2020ని ఒక్క శతకం లేకుండా పూర్తి చేశాడు. అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులే చేసిన అతడు ఈ ఏడాదిని అలా ముగించాడు. దీంతో 2008 తర్వాత తొలిసారి సెంచరీ లేకుండా నిలిచాడు. అతడు అరంగేట్రం చేసిన ఏడాది మినహాయిస్తే కోహ్లీ ఏటా శతకాలతో మైమరపించాడు. ఈ ఏడాది కరోనా పరిస్థితుల కారణంగా సుమారు 9 నెలలు అంతర్జాతీయ ఆటకు దూరమవడంతో 2020ని ఇలా ముగించాడు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version