https://oktelugu.com/

రాజుగారి బూతు సినిమా ‘డర్టీ హరి’ ఎలా ఉందంటే ?

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు అంటేనే భారీ సినిమాలు గుర్తుకువస్తాయి. అయితే అలాంటి భారీ నిర్మాత, దర్శకుడిగా ఒక బూతు సినిమా తీశాడు. చిత్రం పేరు ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ ఇందులో హీరో హీరోయిన్లు. ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ఏటిటి యాప్ ద్వారా ఈ సినిమా విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే.. ఒక్కమాటలో బూతు సినిమాకు తక్కువ, సీరియల్ బోల్డ్ డ్రామాకి ఎక్కువ అన్నట్టు ఉంది […]

Written By:
  • admin
  • , Updated On : December 19, 2020 / 05:13 PM IST
    Follow us on


    ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు అంటేనే భారీ సినిమాలు గుర్తుకువస్తాయి. అయితే అలాంటి భారీ నిర్మాత, దర్శకుడిగా ఒక బూతు సినిమా తీశాడు. చిత్రం పేరు ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ ఇందులో హీరో హీరోయిన్లు. ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ఏటిటి యాప్ ద్వారా ఈ సినిమా విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే.. ఒక్కమాటలో బూతు సినిమాకు తక్కువ, సీరియల్ బోల్డ్ డ్రామాకి ఎక్కువ అన్నట్టు ఉంది ఈ సినిమా అవుట్ ఫుట్.

    Also Read: రౌడీ పొలిటీషియన్ గా పవన్… షాకిస్తున్న స్టోరీ లైన్?

    ముందుగా కథ విషయానికి వస్తే.. హ‌రి (శ్రవణ్‌ రెడ్డి) లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఆశ పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో జాబ్ కోసం న‌గ‌రరానికి చేరుకుని.. మొత్తానికి ధ‌నవంతుల కుటుంబానికి చెందిన వ‌సుధ (రుహానీ శ‌ర్మ‌) అనే అమ్మాయిని ప్రేమ‌లో పడేసి.. ఆ రకంగా సెటిల్ అవుతాడు. కానీ ఇంత‌లో వ‌సుధ సోద‌రుడి ప్రియురాలైన జాస్మిన్ (సిమ్రత్‌ కౌర్‌)ని చూసి మనోడికి ప్రేమ పుట్టడం.. ఫలితంగా జాస్మిన్ గర్భవతి అవ్వడం చకచకా జరిగిపోతాయి. ఈ డ్రామాలో ధ‌న‌వంతురాలైన వ‌సుధ నుంచి విడిపోలేడు, అలా అని గర్భవతి అయిన జాస్మిన్ బంధాన్ని అంత తేలిగ్గా వదిలించుకోలేడు. చివరకు ఈ ముగ్గురి జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరగాయనేది ఈ సినిమా మిగిలిన బాగోతం.

    అయితే, ‘డర్టీ హరి’లో బోల్డ్ నెస్ తో పాటు మంచి కంటెంట్ కూడా ఉంది. ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఇంకొక మనిషి దాగి ఉంటాడనే కాన్సెప్ట్ తో సాగిన ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ తో పాటు హీరో పాత్రకు ఇద్దరమ్మాయిలతో ఏర్పడిన అనుబంధం తాలూకు సన్నివేశాలు, అలాగే ఈ ముగ్గురి మధ్యన జరిగే డ్రామా అండ్ ఎమోషన్ ఆకట్టుకుంటుంది. ఇక హీరోగా నటించిన శ్రవణ్ రెడ్డి లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్రకు తగ్గట్లు చాలా ఫిట్ గా కనిపించాడు. ఇక తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు.

    Also Read: ఇప్పటికే మూడు పెళ్లిళ్లు.. మళ్లీ ప్రేమలో పడిందట..!

    అలాగే బోల్డ్ క్యారెక్టర్ లో నటించిన సిమ్రత్ కౌర్ తన పాత్రలో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అలాగే మరో హీరోయిన్ రుహాని శర్మ కూడా చాల బాగా నటించింది. కీలక సన్నివేశాల్లో, అలాగే ఎమోషనల్ సన్నివేశంలో ఆమె నటన సినిమాకి బాగా ప్లస్ అయింది. అయితే సినిమాలో మెయిన్ పాయింట్ పర్వాలేదనిపించినా.. ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోవు. అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలు ఎక్కువైపోయాయి. కొన్ని సన్నివేశాలకు అయితే సరైన ప్లో కూడా లేదు.

    కాగా ఓవరాల్ గా ఈ బోల్డ్ అండ్ రొమాంటిక్ డ్రామా యూత్ ను కొన్ని అంశాల్లో ఆకట్టుకుంటుంది. కాకపోతే సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం, అలాగే స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. దాంతో ఈ సినిమా ఎక్కువమందికి కనెక్ట్ కాదు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్