భారత్ బంద్ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్ లో పేర్కొంది. ‘రైతులను పరామర్శించికే కేజ్రీవాల్ ను నిన్నటి నుంచి పోలీసులు అరెస్టు చేశారని’ పార్టీ ట్విట్టర్ లో తెలిపింది. మరోవైపు దేశ వ్యాప్తంగా బంద్లో భాగంగా తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. కేటీఆర్, తలసాని శ్రీనివాస గౌడ్, హరీశ్ రావు పాల్గొన్నారు. ఇక ఢిల్లీ సరిహద్దుల్లోకి రైతులు భారీగా చేరుకుంటున్నారు. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలను అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లో భారీగా పోలీసులు మోహరించారు.