ఏలూరులో పెరుగుతున్న వ్యాధి బాధితులు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య రోజరోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 510 మంది ఆసుపత్రి పాలవగా ఇందులో 322 మంది డిశ్చార్జి అయ్యారు. 17 మందిని విజయవాడకు తరలించారు. అయితే ఎప్పటికప్పడు అందరికీ చికిత్స చేస్తున్నా వ్యాధి తీవ్రతకు కారణం తెలియడం లేదు. మరోవైపు వైద్యులు పేషంట్ల బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వ్యాధి కారణాలను అన్వేషిస్తున్నారు. తాగునీరు, పాల ద్వారా శరీరంలోకి లెడ్ వెళ్లి ఉండవచ్చని ఏయిమ్స్ వైద్యులు అంచనా వేస్తున్నారు. […]

Written By: Suresh, Updated On : December 8, 2020 10:51 am
Follow us on

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య రోజరోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 510 మంది ఆసుపత్రి పాలవగా ఇందులో 322 మంది డిశ్చార్జి అయ్యారు. 17 మందిని విజయవాడకు తరలించారు. అయితే ఎప్పటికప్పడు అందరికీ చికిత్స చేస్తున్నా వ్యాధి తీవ్రతకు కారణం తెలియడం లేదు. మరోవైపు వైద్యులు పేషంట్ల బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వ్యాధి కారణాలను అన్వేషిస్తున్నారు. తాగునీరు, పాల ద్వారా శరీరంలోకి లెడ్ వెళ్లి ఉండవచ్చని ఏయిమ్స్ వైద్యులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కేంద్ర ముగ్గురితో కూడిన వైద్య బ్రుందాన్ని ఏలూరుకు పంపించింది. ఈ బ్రుందం ఏలూరులో అస్వస్థతకు గురైన వారిని పరామర్శించి విచారణ చేపట్టనున్నారు.