https://oktelugu.com/

నిహారిక జంట వీడియో వైరల్.. షూట్ చేసింది ఆ దర్శకుడే !

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి  డిసెంబర్‌ 9న ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌ వేదికగా చైతన్యతో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ శుభకార్యానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు.  రెండు రోజుల పాటు వైభ‌వంగా సాగే ఈ వివాహానికి పెళ్లి బృందాలు వెన్యూ వ‌ద్ద‌కు చేరుకున్నాయి. వీరితో పాటు 120 మంది అతిథులు ఈ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజ‌ర‌వుతున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన విశేషాలను, సరదాలను షూట్ చేసి.. మెగా […]

Written By:
  • admin
  • , Updated On : December 8, 2020 / 11:05 AM IST
    Follow us on

    మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి  డిసెంబర్‌ 9న ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌ వేదికగా చైతన్యతో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ శుభకార్యానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు.  రెండు రోజుల పాటు వైభ‌వంగా సాగే ఈ వివాహానికి పెళ్లి బృందాలు వెన్యూ వ‌ద్ద‌కు చేరుకున్నాయి. వీరితో పాటు 120 మంది అతిథులు ఈ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజ‌ర‌వుతున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన విశేషాలను, సరదాలను షూట్ చేసి.. మెగా ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ మెంబర్స్. అయితే వీటిల్లో ఒక వీడియో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

    Also Read: ఉప్పెన’ రిలీజ్ ఎప్పుడంటే… అది మెగా ఇమేజ్ కే సాధ్యం !

    ఆ వీడియో నిహారిక – చైతన్య డ్యాన్స్ వీడియో.  వేదిక‌పై  వధువు  నిహారిక వేసిన జోష్ ఫుల్ డ్యాన్సులు ట్రెండీగా ఉన్నాయి. అలాగే  నిహారికా కొణిదెలతో వ‌రుడు చైత‌న్య కూడా డ్యాన్సులు చేస్తూ సంద‌డి చేయడం, ఈ స‌ర‌దా డ్యాన్స్ బిట్ వీడియో అభిమానుల్లో వైర‌ల్ అవ్వడం మొత్తానికి పెళ్లి హడావుడి సోషల్ మీడియాలో కూడా కనిపిస్తోంది. పైగా  సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టే మెగాస్టార్ `బావ‌గారు బాగున్నారా` సాంగ్ కి కొత్త జంట స్టెప్పులేయ్యడం ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. అందుకే ఫ్యాన్స్ ఒక హ్యాష్ ‌ట్యాగ్ ‌ను సృష్టించి పెళ్లి వీడియోలను ఫోటోలను తెగ ట్రెండ్ చేస్తున్నారు. #NisChay అనే హ్యాష్ ట్యాగ్ తో ఇవ‌న్నీ వైర‌ల్ అవుతున్నాయి.

    Also Read: ‘బిగ్ బాస్ 4’ ఫైనల్ కి చీఫ్ గెస్ట్ ఫిక్స్ !

    కాగా ఇప్ప‌టికే వెన్యూ వ‌ద్ద సంగీత్ వేడుక‌లు అట్ట‌హాసంగా సాగుతున్నాయని తెలుస్తోంది.  ఉదయ్ పూర్ లో ఈ మెగా ఈవెంట్ కి సంబంధించిన వీడియోలను, ఫోటోలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ చేరవేసే బాధ్యతను దర్శకుడు మెహర్ రమేష్ కి అప్పజెప్పారు. అందుకే మెహర్ రమేష్ దగ్గర ఉండి మరి ఈ మధుర జ్ఞాపకాలను తన టీమ్ తో అండ్ కెమెరామెన్ బృందంతో చక్కగా షూట్ చేస్తున్నారట. మెహర్ రమేష్ మెగా ఫ్యామిలీకి దగ్గర బంధువు. పైగా ప్రస్తుతం మెగాస్టార్ తో ఒక సినిమా చేస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్