
ఆస్ట్రేలియాలోని అడిడ్ లో జరుగున్న మూడోరోజు టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో 53 పరుగుల ఆదిక్యతను సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో ఆర్ంభంలోనే తడబడుతోంది. 15 ఓవర్లలోనే తొలి వికెట్ కోల్పోయిన ఆ తరువాత వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బౌలర్లు విజ్రుంభించడంతో 5 వికెట్లు కోల్పోయింది. బుమ్రా 2, పుజారా 0, మయాంక్ 9, రహనే 0, కెప్టెన్ కోహ్లి 4 పరుగుల వద్ద తిరుగుముఖం పట్టారు.ఆస్ట్రేలియాతో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 244 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. ఆసీస్ 191 పరుగులకు మొత్తం వికెట్లు కొల్పోయింది. దీంతో ఆసీస్ పై భారత్ 53 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.