
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో తమ పార్టీ తిరుగుబాటు నేతలతో శనివారం సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో సోనియాతో సమావేశమయ్యే నేతలు ఢిల్లీలోని జన్ పథ్ కు చేరుకున్నారు. వీరిలో గులాం నబీ అజాద్, అనంద్ శర్మ, బీఎస్ హుడా, అంబికా సోనీ, చిదంబరం, అశోక్ గెహ్లాట్ ఉన్నారు. కరోనా సమయం తరువాత తొలిసారి ప్రత్యక్షంగా జరుగుతున్న సమావేశం ఇది. గతంలో పార్టీకి పూర్తికాలపై అధ్యక్షుడిగా సరైన నాయకుడిని నియమించాలని సోనియాగాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే తిరుగుబాటు నేతలకు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మధ్య సయోధ్యను కుదిర్చేందుకు కమల్ నాథ్ బాధ్యతలు స్వీకరించారు.