https://oktelugu.com/

కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: ఆరుగురి మృతి

గుజరాత్ లోని కరోనా బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని రాజ్కోట్ లోని మావ్ డీ ప్రాంతంలో ఉన్న శివానంద్ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే ఆసుపత్రిలో 33 మంది కరోనా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. వీరిలో 6 గురు మంటల్లో చిక్కుకొని మృతి చెందారు. మరో 27 మందిని పోలీసులు రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 27, 2020 / 08:51 AM IST
    Follow us on

    గుజరాత్ లోని కరోనా బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని రాజ్కోట్ లోని మావ్ డీ ప్రాంతంలో ఉన్న శివానంద్ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే ఆసుపత్రిలో 33 మంది కరోనా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. వీరిలో 6 గురు మంటల్లో చిక్కుకొని మృతి చెందారు. మరో 27 మందిని పోలీసులు రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.