ప్రజల గుండెచప్పుడు తెలుసుకునే అతికొద్ది మంది నేతల్లో జగన్ ఒకరు. జగన్‌కు రాజకీయ అనుభవం పదేళ్లే.. అయినా జనంతో ఆయనకు ఉన్న బంధం చాలా గట్టిది. అధికారం కోసం కొట్లాడి.. అధికారం రాకున్నా ప్రజలను వీడి ఉండలేదు. ప్రజల మధ్య నుంచే చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిపై ప్రశ్నించారు. ఆది నుంచి దూకుడుగా వ్యవహరించడమే ఆయన నైజం. అధికారంలోకి వచ్చాక కూడా ఆయన ధైర్యం జనాలే.
Also Read: పెళ్లైన నెలకే గర్భం దాల్చిన మహిళ.. చివరకు..?
ఇదిలా ఉంటే.. మరికొద్ది రోజుల్లో తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు జగన్ తనదైన మార్క్ ప్లాన్ రెడీ చేసిపెట్టుకున్నారు. ఏపీ వరకు తనకు ఎవరూ పోటీ కాదని జగన్ భావిస్తున్నా.. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నదే ఆయన ఆలోచన. అందుకే ఆయన తిరుపతి ఎన్నికను చాలా సీరియస్‌గానే తీసుకున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అధికార టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వచ్చింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అన్నింటికంటే మించి కేసీఆర్ అతి విశ్వాసమే కొంప ముంచిందని విశ్లేషణలు చెబుతున్నాయి. కేసీయార్ దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారు. కనీసం ఆయన చివరి నిమిషంలో ప్రచారం చేసినా విజయం కచ్చితంగా టీఆర్‌ఎస్ ఖాతాలో పడేది. జనాలలోనూ పాజిటివ్ భావన వచ్చేది. కానీ అక్కడ అది జరగలేదు.
Also Read: నారాలోకేష్ కు ఏపీ పోలీసుల హెచ్చరికలు
అలాంటి అనుభవం తమకు రాకూడదని జగన్ అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉంటున్నారట. జగన్ తిరుపతి ఎన్నికల ప్రచారానికి వెళ్తారని అంటున్నారు. తాను ఏడాదిన్నర కాలంగా చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి అది సరైన వేదికగా కూడా ఆయన భావిస్తున్నారట. తిరుపతి వేదికగా విపక్షాల డొల్లతనాన్ని ఎండగట్టడానికి కూడా ఆయన సంసిద్ధులు అవుతున్నారు. పేరుకు తిరుపతి ఎన్నిక అయినా ఏపీ మొత్తం దాన్ని గమనిస్తుంది కాబట్టి ప్రభుత్వం గురించి నాలుగు మంచి మాటలు చెప్పడం ద్వారా మొత్తం ఏపీ జనాలకు కూడా సానుకూల సంకేతాలు పంపడానికి వీలవుతుందని జగన్ వ్యూహం. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ఎగిరి గంతులేస్తున్న టీడీపీ, బీజేపీ తప్పుడు విధానాలను కూడా జగన్ ఎండగడతారని సమాచారం. ఏపీలో ఓటు అడిగే హక్కు 90 శాతం హామీలు నెరవేర్చిన తన ప్రభుత్వానికే ఉందని కూడా జగన్ ఢంకా భజాయించి చెబుతారట. ఇక ప్రత్యేక హోదాతో బీజేపీని, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాజీపడిన టీడీపీని ఎండగట్టడానికి కూడా జగన్ ఆలోచిస్తున్నారని టాక్.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్