అలర్ట్: ఇండియాలోకి ప్రవేశించిన కరోనా స్ట్రేయిన్: ఆరు కేసులు నమోదు

ఇంగ్లాండ్ లో విజ్రుంభిస్తున్న కరోనా స్ట్రేయిన్ భారత్ లోకి ప్రవేశించింది. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన వారికి టెస్టులు నిర్వహించగా సాధారణ కరోనా పాజిటివ్ లు వచ్చాయి. తాజాగా ఆరుగురికి కొత్తరకం కరోనా కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. నిమ్హన్స్ బెంగుళూరులో 3 కేసులు సీసీఎంబీ హైదరాబాద్ లో 2, పూణెలోని ఎన్ఐవీలో ఒక కేసు నమోదైనట్లు గుర్తించారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా స్ట్రెయిన్ గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు […]

Written By: Suresh, Updated On : December 29, 2020 10:15 am
Follow us on

ఇంగ్లాండ్ లో విజ్రుంభిస్తున్న కరోనా స్ట్రేయిన్ భారత్ లోకి ప్రవేశించింది. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన వారికి టెస్టులు నిర్వహించగా సాధారణ కరోనా పాజిటివ్ లు వచ్చాయి. తాజాగా ఆరుగురికి కొత్తరకం కరోనా కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. నిమ్హన్స్ బెంగుళూరులో 3 కేసులు సీసీఎంబీ హైదరాబాద్ లో 2, పూణెలోని ఎన్ఐవీలో ఒక కేసు నమోదైనట్లు గుర్తించారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా స్ట్రెయిన్ గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సైతం టెస్టులు చేసి ఫలితాల కోసం శాంపిల్స్ ను పంపించారు. ఈ కొత్త రకం కేసులు నమోదవడంతో దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంగళవారం అధికారిక ప్రకనటన చేయనున్నట్లు తెలుస్తోంది.