Also Read: జనసేన గూటికి వంగవీటి రాధాకృష్ణ ?.. కీలక భేటి
దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూకుడుకు బీజేపీ ముక్కుతాడు వేసింది. ఇక త్వరలోనే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనుండటంతో ఓరుగల్లులోనూ సత్తా చాటాలని బీజేపీ శ్రేణులు ఉవ్విళ్లురుతున్నాయి.
వరుసగా రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వడంతో బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. టీఆర్ఎస్ వ్యతిరేక వర్గాలన్నీ బీజేపీ వైపు చూస్తుండటంతో వరంగల్ కార్పొరేషన్ పై కాషాయ జెండాను ఎగురవేయాలని భావిస్తోంది.
దీనిలో భాగంగానే వరంగల్ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని.. ప్రచార ఇన్‌చార్జిగా ఎంపీ అర్వింద్‌ను అధిష్టానం తాజాగా నియమించింది. గతంలో రెండు సార్లు అర్వింద్ వరంగల్‌లో ఎంపీ హోదాలో పర్యటించారు.
Also Read: నిరుద్యోగులకు ఎల్‌అండ్‌టీ శుభవార్త.. 1100 ఉద్యోగాల భర్తీకి ప్రకటన..!
ఆ సమయంలో ఒకసారి అర్వింద్‌పై కొంతమంది టీఆర్‌ఎస్ నాయకులు.. కార్యకర్తలు దాడికి యత్నించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాటి నుంచే అర్వింద్ వరంగల్ రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటనకు ముందే బీజేపీ వరంగల్ కార్పొరేషన్ కు ఎన్నికల ప్రచార ఇన్ ఛార్జి అర్వింద్ ను.. ఎన్నికల ఇన్ ఛార్జి జితేందర్ రెడ్డిలను నియమించడంతో రాజకీయాలు హిటెక్కుతున్నాయి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్