
కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్నిఅతలాకుతలం చేస్తోంది. క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆక్స్ ఫామ్ సంస్థ వెల్లడించిన నివేదికలో విస్తుగొలిపే అంశాలు కనిపిస్తాయి. కరోనా పాండమిక్ కాలంలో సంపన్నులు మరింత సంపన్నులు అయిపో యారని తెలిపింద. ఇండియన్ బిలియనీర్ల ఆస్తుల విలువ 35 శాతం పెరిగినట్లు తాజా సర్వే నివేదిక వెల్లడించింది. వీరి ఆస్తుల విలువ ఏ విధంగా పెరిగిందంటే పదకొండు మంది భారతీయ అగ్రశ్రేణి బిలియనీర్ల సంపదతో పోలిస్తే ఉపాధిహామీ పథకాన్ని పదేళ్లు కొనసాగించవచ్చని తెలుస్తోంది.
కరోనా మొదటి దశలో వివిధ దేశాలు నష్టాలు చవిచూశాయి. సంపన్న దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు 9 లక్షల కోట్ల డాలర్ల మేర అదనపు డబ్బు ముద్రించాయి. దీంతో ఆర్థిక వ్యవస్థలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. కరోనా మొదటి వేవ్ లో అతిసంపన్నుల మొత్తం సంపద 5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 13 లక్షల కోట్ల డాలర్లకు పెరిగిపోయింది. ఆర్థిక వేత్త మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్ చీఫ్ గ్లోబల్ స్ర్టాటజిస్ట్ రుచిర్ శర్మ ప్రకారం కరోనా మహమ్మారి సంపన్నుల సంపదను మరింత పెంచే ఉద్దీపన శక్తిగా మారింది.
2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 14.4 కోట్ల మంద దారిద్ర్య రేఖ దిగువకు తోసేయబడ్డారని తేలింది. ఈ అంకెల ప్రకారం చూస్తే అత్యంత దారిద్ర్యంలో కూరుకుపోయన అత్యధిక జనాభా విషయంలో భారత్ ఇప్పుడు నైజీరియాను దాటేసింది. భారత్ లో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న భారీ జనసంఖ్యకు ఇప్పుడు మరో 8.5 కోట్ల మంది జతకావడం గమనార్హం. ప్రపంచం నుంచి కటిక దారిద్ర్యాన్ని రూపుమాపడానికి కేవలం 100 బిలియన్ల అమెరికన్ డాలర్లు వెచ్చిస్తే సరిపోతుంది.
కరోనా కాలంలో అమెరికాలోని బిలియనీర్ల సంపద 44.6 శాతానికి పెరిగిపోయిందని ఇన్ స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీ వెల్లడంచింది. అమెరికాలో 8 కోట్ల మంది ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. అమెరికాలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న16 కోట్ల సంపదతో పోలిస్తే 50 మంది అగ్రశ్రేణి సంపన్నుల సంపద అధికంగా ఉంది.2013 నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీసు నివేదిక ప్రకారం సగటు వ్యవసాయ కుటుంబం ఆదాయాన్ని పరిశీలిస్తే సగటును నె లకు రూ.6,426 మాత్రమే అని తెలుస్తోంది.
నిరుపేదల జీవితాల్లో వెలుగును తీసుకొచ్చే ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను రాయితీలు, బ్యాంకు బకాయిలు రద్దు, బెయిలవుట్లు, కార్పొరేట్ ప్రోత్సాహకాల పేరిట భారీస్థాయిలో సంస్థలకు సబ్సిడీల రూపంలో అందించడం రూపంలో మరింత డబ్బును సంపన్నుల జేబుల్లోకి చేరే తరహా విధానాలు కొనసాగిస్తున్నారు. నిరుపేదలు నిత్యం తమను కాచుకునే దుస్థితిలోకి జారిపోతున్నారు. అభివృద్ధి అనే భావన ప్రధానంగా పేదలను పరిణనలోకి తీసుకోవాలి. ఆదాయపరమైన అసమానతల తొలగింపునకు అదే అసలైన పరిష్కారం.