ఇండియా గేట్‌ వద్ద అమల్లోకి 144 సెక్షన్‌..

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో యువతిపై అత్యాయత్నానికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న రాహుల్‌గాంధీ, ప్రియాంకలు హత్రాస్‌ జిల్లాకు వెళ్లిన సందర్భంగా వారిని అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ సదర్భంగా ఢిల్లీలోని ఇండియా గేట్‌ పరిసర ప్రాంతాల్లో 114 సెక్షన్‌ విధించారు. ఒకవేళ ఎలాంటి నిరసనలకైనా అనుమతులు ఉంటే ఇండియా గేట్‌కు 3 కి.మీ. దూరంలోని జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించుకోవాలని, వందమంది కంటే ఎక్కువ మంది గూమిగూడడానికి వీళ్లేదని పోలీసులు స్పష్టం […]

Written By: NARESH, Updated On : October 2, 2020 10:02 am
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో యువతిపై అత్యాయత్నానికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న రాహుల్‌గాంధీ, ప్రియాంకలు హత్రాస్‌ జిల్లాకు వెళ్లిన సందర్భంగా వారిని అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ సదర్భంగా ఢిల్లీలోని ఇండియా గేట్‌ పరిసర ప్రాంతాల్లో 114 సెక్షన్‌ విధించారు. ఒకవేళ ఎలాంటి నిరసనలకైనా అనుమతులు ఉంటే ఇండియా గేట్‌కు 3 కి.మీ. దూరంలోని జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించుకోవాలని, వందమంది కంటే ఎక్కువ మంది గూమిగూడడానికి వీళ్లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

Also Read: దళితులపై కాంగ్రెస్ కపట ప్రేమ