బిగ్ బాస్ నటికి కరోనా.. ఆస్పత్రికి తరలింపు

  దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. ప్రభావం తగ్గుతున్నా.. డిశ్చార్జిల సంఖ్య ఉపశమనం కలిగిస్తున్నా.. వైరస్‌ పాజిటివ్‌ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా ఇప్పటికే లక్షకు చేరుకుంది. ప్రముఖులు, పేదోళ్లు అని తేడా లేకుండా అందరినీ బలితీసుకుంటూనే ఉంది. Also Read: ‘డార్లింగ్’పైనే టాలీవుడ్ నిర్మాతల ఆశలు..! తాజాగా పంజాబ్‌ గాయని, సినీనటి హిమాన్షీ ఖురానా కరోనా బారిన పడింది. ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. […]

Written By: NARESH, Updated On : October 2, 2020 10:07 am
Follow us on

 

దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. ప్రభావం తగ్గుతున్నా.. డిశ్చార్జిల సంఖ్య ఉపశమనం కలిగిస్తున్నా.. వైరస్‌ పాజిటివ్‌ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా ఇప్పటికే లక్షకు చేరుకుంది. ప్రముఖులు, పేదోళ్లు అని తేడా లేకుండా అందరినీ బలితీసుకుంటూనే ఉంది.

Also Read: ‘డార్లింగ్’పైనే టాలీవుడ్ నిర్మాతల ఆశలు..!

తాజాగా పంజాబ్‌ గాయని, సినీనటి హిమాన్షీ ఖురానా కరోనా బారిన పడింది. ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. హిమాన్సీ ఖురానాకు కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. హోంక్వారంటైన్ లో ఉన్న ఆమెకు 105 డిగ్రీల జ్వరంతో పాటు ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ తగ్గాయి. దీంతో ఆమెను పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా ఆసుపత్రికి తరలించారు.

కరోనా సోకినా హోం క్వారంటైన్ లో ఉండగా హిమాన్షీ ఆరోగ్యం క్షీణించింది. చండీఘడ్ లోని ఇంట్లో ఉన్న హిమాన్షీకి కరోనా వల్ల ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ తగ్గడంతో ఆమెను లూథియానాలోని ఆసుపత్రికి అంబులెన్సులో తరలించామని ఆమె బంధువులు చెప్పారు. ఇటీవల రైతు బిల్లుకు వ్యతిరేకంగా రైతులు చేసిన నిరసన కార్యక్రమంలో హిమాన్షీ పాల్గొన్నారు. బిగ్ బాస్ 13లో వైల్డ్ కార్డుపై ప్రవేశించిన హిమాన్షీ లక్షలాది మంది ప్రజల అభిమానం పొందారు. పంజాబ్ సంగీత ప్రపంచంలో హిమాన్షీకి ఎంతో పేరుంది.

Also Read: టాలీవుడ్ లో మరో పెద్ద స్టూడియో.. అల్లు అరవింద్ సంచలనం

ఇటీవల గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా వైరస్‌కు బలయ్యారు.  ఆ మధ్య కేంద్ర మంత్రి, ఎంపీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. హిమాన్షీ ఆరోగ్యం క్షీణించింది. ఆమె తొరగా కోలుకొని తిరిగి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మనం కూడా చెబుదాం హిమాన్షీకి.. గెట్‌ వెల్‌ సూన్‌ హిమాన్షీ.