రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సిద్ధాంతకర్త, మొదటి ప్రతినిధి మాధవ్ గోవింద్ వైద్య మరణించారు. 97 సంవత్సరాల ఆయన శనివారం మధ్యాహ్నం కన్నుమూసినట్లు ఆయన మనువడు విష్ణు వైద్య తెలిపారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ‘గోవింద్ కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడ్డా కోలుకున్నాడు. శుక్రవారం అతని ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది.’ అని పేర్కొన్నారు. కాగా మాధవ్ మరణంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘ఆర్ఎస్ఎస్ కు దశాబ్దాలుగా ఎంతో క్రుషి చేశారు. బీజేపీని బలోపేతం చేయడానికి కష్టపడ్డారు. ఆయన మరణంతో ఎంతో బాధపడ్డాను. ఆయన కుటుంబానికి సంతాపం’అంటూ ప్రధాని ట్విట్టర్ లోపేర్కొన్నారు.