
ఉత్తరప్రదేశ్ లోని ఓ వ్యక్తి తెల్లారి చూసేసరికి తన ఇంటిపైకప్పుపై ఓ బ్యాగు కనిపించింది. దీంతో ఆ వ్యక్తి దానిని తెరిచి చూడగా నోట్లకట్టలు, బంగారం ఉంది. దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఉత్తరప్రదేశ్ లోని వరుణ్ శర్మ తన తన ఇంటిపైకప్పున్న బ్యాగు గురించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు దానిని ఓపెన్ చేయగా డబ్బు, నగలు ఉన్నాయి. ఎవరైనా తన ఇంటి పక్కింట్లో దొంగతనం చేసి వరుణ్ శర్మ ఇంటి పైకప్పు పడేశారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇంటికి పనిచేసిన సెక్యూరిటీ గార్డును అదుపులిలోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా వరుణ్ శర్మ నిజాయితీని అందరూ ప్రశంసిస్తున్నారు.