https://oktelugu.com/

వైరల్: ‘ఆర్ఆర్ఆర్’ దీపావళి అప్డేట్.. ఫ్యాన్స్ కు పండుగే..!

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళిని ‘ఆర్ఆర్ఆర్’ను తెరక్కిస్తుండటంతో ఈ సినిమాపై సినీప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్లో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దీపావళి అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. Also Read: అనుపమ క్యూట్ వేషాలు.. కుర్రాళ్లు ఫిదా..! ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే ‘భీమ్ ఫర్ రామరాజు’.. ‘రామరాజు ఫర్ భీమ్’ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2020 / 01:53 PM IST
    Follow us on

    దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళిని ‘ఆర్ఆర్ఆర్’ను తెరక్కిస్తుండటంతో ఈ సినిమాపై సినీప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్లో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దీపావళి అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

    Also Read: అనుపమ క్యూట్ వేషాలు.. కుర్రాళ్లు ఫిదా..!

    ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే ‘భీమ్ ఫర్ రామరాజు’.. ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు విడుదలైన సస్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫొటో విడుదల చేసింది. ఇందులో దర్శకుడు రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కన్పిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా వీరంతా సాంప్రదాయ దుస్తుల్లో కన్పించి అభిమానులను ఆకట్టుకున్నారు.

    జక్కన్న.. రాంచరణ్.. ఎన్టీఆర్ లు సరదాగా మాట్లాడుకుంటూ ఒకరికి ఒకరు స్వీట్లు ఇచ్చుకున్నట్లు కన్పిస్తోంది. కన్నుల పండుగలా ఉన్న ఈ ఫొటోను చూసి అభిమానులు మురిసిపోతూ షేర్ చేస్తున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ దీపావళి పిక్ ప్రస్తుతం ట్రెండింగులోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగానే ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ దీపావళి కానుకగా ఏదో ప్లాన్ చేసినట్లుగా కన్పిస్తోంది.

    Also Read: అక్కినేని హీరోలను లైన్లో పెట్టిన అనిల్ రావిపూడి?

    ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురంభీంగా.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా కన్పించబోతున్నాడు. ఇందులో వెటరన్ బ్యూటీ శ్రియ.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్ కు జోడీగా అలియాభట్.. ఎన్టీఆర్ సరసన ఓలివియా నటిస్తోంది. త్వరలోనే అలియా కూడా ఈ మూవీలో షూటింగులో పాల్గొననుందని సమాచారం. ఏదిఏమైనా దీపావళికి ముందే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి అప్డేట్ రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్