గత కొన్ని నెలలుగా నేపాల్ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. సొంత పార్టీ నుంచే ప్రధాని కేపీ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం పార్లమెంట్ రద్దుకు ఆయన ప్రతిపాదనను తీసుకొచ్చారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన పత్రాలను కేబినెట్ రాష్ట్రపతికి పంపించారు. అయితే ప్రధాని నిర్ణయాన్ని అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మంత్రులందరూ హాజరు కాకుండానే నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.