https://oktelugu.com/

క్రిస్మస్ పండుగ రోజున చేసుకునే ప్రత్యేకమైన వంటకాలివే..?

క్రిస్టమస్ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది కానుకలు తమ బంధువులందరికీ బహుమతులు ఇచ్చి ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.అంతే కాకుండ క్రైస్తవ మతస్థులు అందరూ చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. క్రిస్మస్ వేడుకలను వారి ఇళ్లలో ఎంతో ఆకర్షణీయంగా క్రిస్మస్ ట్రీ ను విద్యుత్ దీపాలతో అలంకరించుకొని ఈ వేడుకలు జరుపుకుంటారు. క్రిస్టమస్ అంటేనే ఎంతో రుచికరమైన వంటలు ప్రత్యేకం. తమ ఇంటికి వచ్చే అతిథులకు ప్రత్యేకమైన వంటకాలతో మర్యాదలు చేస్తారు.ఈ పండుగ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 20, 2020 / 01:09 PM IST
    Follow us on

    క్రిస్టమస్ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది కానుకలు తమ బంధువులందరికీ బహుమతులు ఇచ్చి ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.అంతే కాకుండ క్రైస్తవ మతస్థులు అందరూ చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. క్రిస్మస్ వేడుకలను వారి ఇళ్లలో ఎంతో ఆకర్షణీయంగా క్రిస్మస్ ట్రీ ను విద్యుత్ దీపాలతో అలంకరించుకొని ఈ వేడుకలు జరుపుకుంటారు. క్రిస్టమస్ అంటేనే ఎంతో రుచికరమైన వంటలు ప్రత్యేకం.

    తమ ఇంటికి వచ్చే అతిథులకు ప్రత్యేకమైన వంటకాలతో మర్యాదలు చేస్తారు.ఈ పండుగ రోజు చికెన్,మటన్, గ్రిలెడ్ చేసి వండుతారు.బ్రిటీషువారు సంప్రదాయం ప్రకారం కాల్చిన మాంసం, వైన్ ప్రధాన వంటకంగా ఉంటాయి.ఈ వంటకాల వల్ల అక్కడి వారి స్నేహ బంధాలు మెరుగుపడతాయని వారి నమ్మకం. అందుకే క్రిస్మస్ పండుగ రోజు పెద్ద మొత్తంలో ప్రత్యేకమైన వంటకాలు తయారు చేసుకొని, కేకులను,ఫుడ్,వైన్ ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటారు.

    మన దేశంలో కూడా క్రిస్టమస్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.మటన్,చికెన్లతో పాటు పలు రకాల స్వీట్లను తయారు చేసుకొని స్నేహితులు, కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక విందులలో పాల్గొంటారు. యేసక్రీస్తు పుట్టిన రోజుకి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు.విదేశాలలో మటన్ చికెన్ తో పాటు టర్కీ కోడిని మొత్తం వేయించి వడ్డిస్తారు. కొందరైతే ఏకంగా ఒక గొర్రెలను కూడా గ్రిల్ చేసేస్తారు.  అతిథుల కోసం ప్రత్యేకంగా డిన్నర్ పార్టీలు ఏర్పాటు చేసి విందు ఏర్పాటు చేస్తారు.

    ఈ క్రిస్మస్ వేడుకలలో భోజనంతో పాటు కేకులకు కూడ ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. క్రిస్మస్ కు నెల ముందు నుంచే కేకులను తయారుచేయడంతో సెమీ క్రిస్టమస్ వేడుకలను ప్రారంభిస్తారు.ఈ విధంగా కేకులను తయారు చేసి బంధువులకు, మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ పంపుతారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకలప్పుడు కేకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.