https://oktelugu.com/

కేసీఆర్ ను ఓవర్ టేక్ చేస్తున్న జగన్

గత చంద్రబాబు పాలనతో పోల్చినప్పుడు కేసీఆర్ బెటర్ అన్నారు. ఇప్పుడు చంద్రబాబు పోయి జగన్ వచ్చాడు. ఇప్పుడు పోల్చి చూస్తే కేసీఆర్ కంటే జగన్ బెటర్ అంటున్నారు. తెలంగాణకు జగన్ లాంటి పాలన కావాలని ఆశిస్తున్నారు. కేసీఆర్ ను మించి జగన్ పాలనలో దూసుకుపోవడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. Also Read: పీసీసీ చీఫ్‌ ఎవరైనా పాదయాత్ర చేసుడే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య పోలికలు పెరిగాయి. రెండు రాష్ట్రాల్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 20, 2020 5:25 pm
    Follow us on

    KCR Jagan

    గత చంద్రబాబు పాలనతో పోల్చినప్పుడు కేసీఆర్ బెటర్ అన్నారు. ఇప్పుడు చంద్రబాబు పోయి జగన్ వచ్చాడు. ఇప్పుడు పోల్చి చూస్తే కేసీఆర్ కంటే జగన్ బెటర్ అంటున్నారు. తెలంగాణకు జగన్ లాంటి పాలన కావాలని ఆశిస్తున్నారు. కేసీఆర్ ను మించి జగన్ పాలనలో దూసుకుపోవడమే దీనికి కారణంగా చెప్పవచ్చు.

    Also Read: పీసీసీ చీఫ్‌ ఎవరైనా పాదయాత్ర చేసుడే..

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య పోలికలు పెరిగాయి. రెండు రాష్ట్రాల్లో పాలన ఎలా ఉంది. సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి, పేదలు, రైతులు ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారు. అనే అంశాల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరును ప్రజలు చర్చించుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో మొదటగా  చంద్రబాబు, కేసీఆర్ ను పోల్చి చూశారు ప్రజలు. మొదటిసారి మఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ మంచి పనితనం చూపెట్టారు. పలురకాల పథకాలతో కేసీఆర్ ప్రజల మనసును గెలిచారు. రైతుబంధు పథకంతో రైతుల గుండెళ్లో నిలిచారు. అందుకే రెండో సారి విజయం సాధించారు కేసీఆర్.

    మరోవైపు చంద్రబాబు మీద విమర్శలు వెల్లువెత్తాయి. కేసీఆర్ పనితనం చూపించి ప్రజలు చంద్రబాబును ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలన సరిగా లేదని విమర్శించారు. అందుకే గత ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు.

    అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక  సీన్ రివర్స్ అయ్యింది. జగన్ చేసిన పనులు చూపిస్తూ కేసీఆర్ మీద ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్  పలు రకాల పథకాలతో నేరుగా మహిళాల ఖాతల్లోకి నగదు జమ చేస్తున్నారు. పేదలకు ఉచితంగా భూ పట్టాలను అందజేస్తున్నారు. ఈ పట్టాల అంశాల్లోనే కేసీఆర్ ఒత్తిడి పెరుగుతోంది. జగన్ పాదయత్రలో ఇచ్చిన హామీల మేరకు పోడు వ్యవసాయం చేసుకుంటున్నా రైతులకు భూ పట్టాలను ఇవ్వాలని సంకల్పించారు జగన్. ఇప్పటికే పనులు మొదలు పెట్టారు. దీంతో ఏపీలో గిరిజనులు సంతోషంలో ఉన్నారు. తెలంగాణలో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.  తెలంగాణలో హరితహరం పేరుతో  ప్రభుత్వ అడవుల్లో మొక్కలు నాటుతున్నారు.  దీంతో పంట ధ్వంసం అవుతున్నాయని గిరిజనులు అంటున్నారు. కొన్ని సంవత్సరాలు సాగుచేసుకుంటున్నా పోడు భూములను  ఇలా లాగేసుకుంటే  ఎక్కడికి పోవాలని గిరిజనులు వాపోతున్నారు.

    Also Read: శేఖర్‌‌ రెడ్డికి, వైసీపీకి ఉన్న బంధం ఏంటో..?

    గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ 89 వేల మందికి భూముల పంచారు. అయితే వాటిలో కొన్నింటికి పట్టాలు లేవు. తెలంగాణ పరిధిలో ఉన్న అలాంటి భూములే ఇప్పడు సమస్యగా మారాయి.  దాదాపు 6 వేల  ఎకరాల్లో సాగు చేసుకుంటున్నా రైతులు అటవీ శాఖ అధికారులతో ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత పట్టాలను ఇవ్వాలని గిరిజనుల కోరుతున్నారు. పక్క రాష్ట్రం లో గిరిజనులు భూ పట్టాలను ఇస్తుంటే ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా జోలికి ఎవరు రాలేదు. ఇప్పడు ఎందుకు వస్తున్నారని అడుగుతున్నారు.

    జగన్ సీనిపరిశ్రమకు ఉరట కల్పించే నిర్ణయం తీసుకున్నారు.  అన్నీ థియేటర్లకు మూడు నేలల పాటు కరెంటు బిల్లు మాపీ చేశారు జగన్. అలాగే ఆరు నెలల వరకు కరెంటు బిల్లు చెల్లింపులు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై చిరంజీవియే కాదు సినీ పరిశ్రమ పెద్దలంతా హర్షం వ్యక్తం చేశారు. దీంతో  తెలంగాణలో  సీఎం జగన్ అయితే పాలన సరిగా ఉంటుందని కొందరు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్