Homeజాతీయం - అంతర్జాతీయంQueen Of Elizabeth: బ్రిటన్ రాణి కోసం 30 ఏళ్ల కిందటే శవపేటిక తయారీ.. ఇందులో...

Queen Of Elizabeth: బ్రిటన్ రాణి కోసం 30 ఏళ్ల కిందటే శవపేటిక తయారీ.. ఇందులో సంచలన విషయాలివీ

Queen of Elizabeth: బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు దేశ విదేశాల నుంచి రెండు వేల మంది హాజరయ్యారు. మన దేశం నుంచి రాష్ర్టపతి ద్రౌపది ముర్ము పాల్గొని నివాళులర్పించారు. అధికారిక లాంఛనాలతో అశ్రునయనాల మధ్య కనీవిని ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. వెస్ట్ మిన్ స్టర్ హాల్ లోని క్యాటపాక్ పై ఉన్న రాణి శవపేటికను విండ్సర్ క్యాసిల్ కు తరలించారు. అంతకుముందు ఆమె పార్థిక దేహాన్ని వెస్ట్ మిన్ స్టర్ అటేకు తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించారు.

Elizabeth Queen
Elizabeth

రాణి అంత్యక్రియలు జరుగుతున్న వెస్ట్ మిన్ స్టర్ అబే చర్చిలోని బ్రిటన్ రాజు, రాణి పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. 1947లోనే రాణి ఎలిజబెత్ ఫిలిప్ వివాహం కూడా ఇక్కడే జరిగింది. వెస్ట్ మిన్ స్టర్ అబేలో ప్రార్థనలు జరిగే సమయంలో అక్కడున్న గంటను 96 సార్లు మోగించారు. క్వీన్ ఎలిజబెత్ జీవించిన 96 ఏళ్లకు గుర్తుకు ఇలా చేయడం తెలిసిందే. రాయల్ నేవీ స్టేట్ గన్ క్యారేజ్ లో రాణి ఎలిజబెత్ పార్థివ దేహాన్ని ఉంచారు. చివరిసారిగా ఈ క్యారేజ్ ను 1979లో లార్డ్ మౌంట్ బాటన్ అంత్యక్రియల్లో ఉపయోగించడం గమనార్హం.

Also Read: Instagram: ఇన్ స్టా గ్రామ్ వాడుతున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే

రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు అరవై ఏళ్ల కిందటే ఏర్పాట్లు జరిగాయి. విన్ స్టన్ చర్చిల్ లో ఉపయోగించే శవపేటికకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంగ్లిష్ ఓక్ కలప, సీసపు పూత కలిగిన శవపేటికను 30 ఏళ్ల కిందటే తయారు చేసిన సంగతి విధితమే. రాణి ఎలిజబెత్ అంత్యక్రియల కోసం ఏనాడో తయారు చేసిన శవపేటికను సిద్ధంగా ఉంచారు. తమ వారసత్వానికి ప్రతీకగా నిలిచే దహన సంస్కారాలకు రాజుల సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. దీంతో రాణి అంత్యక్రియలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు.

Queen Elizabeth
Queen Elizabeth

దాదాపు అరవై ఏళ్ల కిందటే రాణి చనిపోతే ఎలా అంత్యక్రియలు చేయాలనేదానిపై ఓ ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆమె అంత్యక్రియలు జరుగుతున్నాయి. రాజ కుటుంబానికి ఉండే అర్హతల దృష్ట్యా రాజ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. లక్షలాది మంది జనం సమక్షంలో రాణి అంత్యక్రియలు జరిపించారు. పలు దేశాల నుంచి ఎంతో మంది రాణికి చివరి వీడ్కోలు పలికారు. క్వీన్ శవపేటికను కాటాపాల్క్ అని పిలిచే ఎత్తైన వేదికపై ఉంచారు.

రాణి పార్థివ దేహాన్ని చూసేందుకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. రాణి శవపేటికను ముప్పై ఏళ్ల కిందటే రూపొందించారు. ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. శవపేటిక సాధారణ చెక్కతో లోపలి బాగం సీసం పూతను కలిగి ఉంటుంది. పై భాగంలో ఓక్ కలపతో తయారు చేసిన పెట్టెలో అమర్చబడి ఉంటుంది. సాధారణ శవపేటిక కంటే అధిక బరువు ఉండేలా ఏర్పాటు చేశారు. రాణి కోసం ఏర్పాటు చేసిన ఈ పేటిక మోయాలంటే ఎనిమిది మంది సైనిక సిబ్బంది కావాలి. శవపేటికల్లో సీసపు పూతను ఉపయోగించడం వందల ఏళ్ల ముందు నుంచే చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Sreemukhi- Vishnupriya: ఆ వ్యక్తిని చూస్తేనే మూడ్ వస్తుంది..అస్సలు ఆగలేను.. విష్ణుప్రియ హాట్ కామెంట్స్

Recommended videos:

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular