Homeఎంటర్టైన్మెంట్Abhinayashree: బిగ్ బాస్ మొత్తం మోసం.. షో నిర్వాహకులు నా పట్ల దారుణం చేశారు.. ...

Abhinayashree: బిగ్ బాస్ మొత్తం మోసం.. షో నిర్వాహకులు నా పట్ల దారుణం చేశారు.. అభినయశ్రీ షాకింగ్ కామెంట్స్

Abhinayashree: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఐదు సీజన్లు ప్రసారమవగా… అన్ని సీజన్లు టీఆర్పీ రేటింగుల్లో దూసుకుపోయాయి. ఇప్పుడు బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6 నడుస్తోంది. ఈ సీజన్ లో మొత్తం 20 మంది కంటెస్టెంట్లు లోపలకి వెళ్లారు. ఒక్కొక్కరి గురించి ముఖ్యంగా ఒక్కొక్కరి రెమ్యూనరేషన్ గురించి చాలా పుకార్లు వినిపించాయి. అయితే, అసలు వాటిల్లో నిజం లేదు అంటుంది అభినయశ్రీ. మంచో చెడో అభినయశ్రీ మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. రెండు వారాలకే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

Abhinayashree
Abhinayashree

అయితే, బయటకు రావడం ఆలస్యం.. అభినయశ్రీలో కోపం కట్టలు తెచ్చుకుంది. బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా బిగ్ బాస్ షో నిర్వాహకులు తనను దారుణంగా మోసం చేసారని ఆమె కామెంట్స్ చేసింది. పైగా తనకు బిగ్ బాస్ ద్వారా 5 లక్షల రూపాయల పారితోషికం దక్కిందనే వార్త బాగా వైరల్ అవుతుందని.. కానీ, ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని అభినయశ్రీ తేల్చి చెప్పింది. పైగా నన్ను స్క్రీన్ లో సరిగ్గా చూపించలేదు అంటూ అభినయశ్రీ విమర్శలు చేసింది.

Also Read: Samantha-Naga Chaitanya’s divorce: సమంత-నాగ చైతన్య విడాకులకు మహేష్ బాబే కారణం… ఈ నిజం తెలిశాక మీరే ఒప్పుకుంటారు!

బిగ్ బాస్ యాజమాన్యం కావాలనే షోలో కొంతమందిని మాత్రమే హైలైట్ చేస్తోందని.. ఇది అన్యాయం అని అభినయశ్రీ చెప్పుకొచ్చింది. ఇక చివరగా బిగ్ బాస్ వల్ల తనకు అసలు గుడ్ జరగలేదని, పైగా చాలా బ్యాడ్ జరిగిందని, అసలు బిగ్ బాస్ షో అంతా మోసమని, ముఖ్యంగా బిగ్ బాస్ తనను మోసం చేశాడని అభినయశ్రీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరి అభినయశ్రీ వెల్లడించిన విషయాల్లో నిజం ఎంత ఉన్నది అనేది ఆమెకే తెలియాలి.

Abhinayashree
Abhinayashree

నిజానికి బిగ్ బాస్ కి ఇలాంటి విమర్శలు ఏ మాత్రం కొత్త కాదు. గతంలో చాలామంది కంటెస్టెంట్లు ఈ తరహా విమర్శలు చేశారు. ఇప్పుడు అభినయశ్రీ కూడా నెగిటివ్ కామెంట్స్ చేసింది. మరి రాబోయే రోజుల్లో ఇతర కంటెస్టెంట్లు ఏ విధంగా స్పందిస్తారో అనేది చూడాలి. ఇక అభినయశ్రీ కెరీర్ విషయానికి వస్తే.. .తెలుగులో పలు స్పెషల్ సాంగ్స్ లో ఆమె నటించింది. ఐటమ్ భామగా పాపులర్ అయినా, అభినయశ్రీ కి మాత్రం ప్రస్తుతం అవకాశాలు లేవు.

Also Read:Instagram: ఇన్ స్టా గ్రామ్ వాడుతున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే

Recommended videos:

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular