
ప్రధాని మోదీ 100వ కిసాన్ రైలును సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని యోదీ మాట్లాడుతూ. దేశంలోని 80 శాతం సన్న, చిన్నకారు రైతులకు కిసాన్ రైలు ద్వారా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. రైతుల సాధికారతలో కిసాన్ రైలు ఓ పెద్ద ముందడుగని అభివర్ణించారు. నాలుగు నెలలుగా కిసాన్ రైల్ నెట్‌వర్క్‌ను పెంచుతున్నట్లు తెలిపారు. సరుకు పరిమాణంతో సంబంధం లేకుండా ఆయా మార్గంలోని అన్ని ప్రాంతాల నుంచి త్వరగా పాడైపోయే కూరగాయలు, పండ్ల లోడింగ్, అన్‌లోడింగ్‌కు అనుమతి ఉంటుందని తెలిపారు.